Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Farokh Engineer: కోహ్లీ దూకుడు ఇష్టమే.. కానీ అతని కోపం అదుపులో ఉండాలి!

Farokh Engineer says I admire Virat Kohli but his aggression should be within limits
England ఆటగాళ్లతో గొడవ అనవసరం.. Virat Kohli కోపం తగ్గించుకోవాలి..! || Oneindia Telugu

న్యూఢిల్లీ: మైదానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కనబరిచే దూకుడు తనకు ఇష్టమని మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ ఫరూక్ ఇంజనీర్ అన్నాడు. అయితే కోహ్లీ తన కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని సూచించాడు. అనవసర విషయాలకు వెళ్లి పరిస్థితులు చేయిదాటిపోయేలా చేసుకోవద్దన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దం నడిచిన విషయం తెలిసిందే. భారత ఆటగాళ్లను ఇంగ్లండ్ ప్లేయర్స్ కవ్వించడం.. వారు కూడా అదే స్థాయిలో ధీటుగా బదులిచ్చారు. మరింత కసిగా ఆడి చిరస్మరణీయ విజయాన్నందుకున్నాడు. ఈ క్రమంలోనే మైదానంలో జరిగిన సంఘటనలపై స్పందించిన ఫరూక్‌ ఇంజినీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లీ కొంచెం చూసుకో..

కోహ్లీ కొంచెం చూసుకో..

'ప్రత్యర్థులతో దూకుడుగా ఉండే విషయంలో నేను కోహ్లీని ఎంతో ఇష్టపడతాను. అతనో స్ఫూర్తిదాయక సారథి. ఎల్లప్పుడూ మైదానంలో చురుగ్గా ఉంటాడు. ఏ కెప్టెన్ అయినా అలాగే ఉండాలి. అయితే, అది హద్దులు దాటకూడదు. లేకపోతే అంపైర్లు లేదా మ్యాచ్‌ రిఫరీలు కలుగజేసుకునే వివాదం పెద్దది అవుతుంది. అలాగే విరాట్‌ కోహ్లీ కొన్నిసార్లు తన కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కానీ, నాకు అతని తీరు ఎంతో ముచ్చటేస్తుంది. అతనో మేటి సారథి. అందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అతను' అంటూ ఫరూక్‌ పొగడ్తల వర్షం కురిపించాడు.

బుమ్రా, షమీ సూపర్..

బుమ్రా, షమీ సూపర్..

ఇక రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లు కవ్వింపులకు దిగారని, దాంతో భారత బ్యాట్స్‌మెన్‌ను మానసికంగా దెబ్బతీయాలని చూశారని మాజీ క్రికెటర్‌ పేర్కొన్నాడు. కానీ ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్రయత్నాలను బుమ్రా, షమీ అద్భుతంగా ఆడి ధీటుగా జవాబిచ్చారన్నాడు. 'స్లెడ్జింగ్ ద్వారా బ్యాట్స్‌మన్‌ ఆత్మవిశ్వాసంపై దెబ్బతీయాలని భావించారు. కానీ బుమ్రా, షమీ వారిని ధీటుగా ఎదుర్కొన్నారు. వారి భాషలోనే బదులిచ్చారు. బుమ్రా, షమీలకు బ్యాటింగ్ బాగా చేయమనే విషయం తెలుసు. అలాగే ఎలా గట్టెక్కాలనే విషయంపై కూడా వారికి అవగాహన ఉంది. ఆ ప్రయత్నంలోనే వారు జట్టు విజయానికి కావాల్సిన కీలక పరుగులు చేశారు. దాంతో కోహ్లీ సేన డిక్లేర్ చేసి అద్భుత విజయాన్నందుకుంది.'అని ఫరూక్ చెప్పుకొచ్చాడు.

బ్లడీ ఇండియన్స్ అనేవారు..

బ్లడీ ఇండియన్స్ అనేవారు..

భారత్ తరఫున 45 టెస్ట్‌లు, 5 వన్డేలు ఆడిన ఫరూక్.. తాను క్రికెట్ ఆడే సమయంలో కూడా ఇంగ్లండ్ ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు దిగేవారని గుర్తు చేసుకున్నాడు. వారి మాటలకు తమ ఆటతోనే బదులిచ్చేవాళ్లమన్నాడు. 'మా హయాంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు మమ్మల్ని బ్లడీ ఇండియన్స్ అనేవారు. జాతి వివక్ష వ్యాఖ్యలు చేసేవారు. మా యాసను ఎగతాళి చేసేవారు. నిజానికి నా ఇంగ్లీష్ చాలా మంది ఆంగ్లేయుల కన్నా మెరుగ్గా ఉంటుంది. త్వరలోనే వారికది అర్థమైంది. నేను వెంటవెంటనే ముఖం మీద బుదిల్చేవాడిని. ఇక కీపింగ్‌లోను అదరగొట్టాను. దాంతో ఫరూక్ జోలిక పోవద్దని వారికి తెలిసొచ్చింది'అని ఫరూక్ పేర్కొన్నాడు.

 ఐపీఎల్‌తో బూట్లు నాకుతున్నారు..

ఐపీఎల్‌తో బూట్లు నాకుతున్నారు..

ఐపీఎల్ రాకతో మొత్తం పరిస్థితి మారిపోయిందని ఫరూక్ తెలిపాడు. 'కొన్నేళ్ల క్రితం వరకు బ్లడీ ఇండియన్స్ అన్నారు. ఎప్పుడైతే ఐపీఎల్ మొదలైందో.. కేవలం డబ్బు కోసమే మన బూట్లు నాకుతున్నారు. కానీ నాలాంటి వాళ్లకే మొదట్లో వారి అసలు రంగేంటో తెలుసు. ఇప్పుడు హఠాత్తుగా వాళ్ల రాగం మారింది. కొన్ని నెలలు గడిపేందుకు, డబ్బు ఆర్జించేందుకు ఇప్పుడు భారత్ వారికి గొప్ప దేశంగా మారింది.'అని ఈ మాజీ వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు. లార్డ్స్ టెస్ట్ విజయంతో భారత్ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0‌తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ బుధవారం నుంచి లీడ్స్ వేదికగా జరగనుంది.

Story first published: Sunday, August 22, 2021, 20:01 [IST]
Other articles published on Aug 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+