న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: విరాట్ కోహ్లీని వెంటనే కెప్టెన్‌గా నియమించాలి.. వీ వాంట్.! అభిమానుల ఆందోళన!

Fans want Virat Kohli to captain for the 5th Test after Rohit Sharma tests Covid-19 positive

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మళ్లీ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించాలని అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేగింది. ముందుగా రవిచంద్రన్ అశ్విన్ వైరస్ బారిన పడగా.. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం కరోనా పాజిటీవ్‌గా తేలాడు. దాంతో ఇంగ్లండ్‌తో జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఏకైక టెస్ట్‌కు అతను దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలోనే జట్టు సారథ్య బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించాలని ఫ్యాన్స్ బీసీసీఐకి సూచిస్తున్నారు.

కరోనా కలకలం..

శనివారం నిర్వహించిన యాంటిజెన్‌ పరీక్షల్లో అతడికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ఆదివారం తెల్లవారుజామున ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం అతను టీమ్‌ బస చేసిన హోటల్‌లోనే ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం లీసెస్టర్‌ జట్టుతో జరుగుతోన్న వార్మప్‌ మ్యాచ్‌లో గురువారం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసి 25 పరుగులు చేశాడు. కానీ, శనివారం రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా బ్యాటింగ్‌కు రాలేదు. ఈ క్రమంలోనే రోహిత్‌కు పాజిటివ్‌గా తేలడంతో ఇరు జట్లలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.

బుమ్రా వద్దు.. కోహ్లీ ముద్దు..

కాగా, గతేడాది పూర్తికావాల్సిన 5 టెస్టుల ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరిగాక.. కరోనా కేసుల కారణంగానే ఐదో మ్యాచ్‌ వాయిదా పడింది. అప్పుడు కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు మళ్లీ అదే టెస్టుకు ముందు పలువురు భారత ఆటగాళ్లు కొవిడ్‌-19 బారిన పడటం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. అయితే, రోహిత్‌ ఈ టెస్టుకు ముందు కోలుకుంటే కెప్టెన్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. లేకపోతే రిషభ్‌ పంత్‌ లేదా జస్ప్రిత్‌ బుమ్రా కెప్టెన్సీ చేసే వీలుంది. కానీ అభిమానులు మాత్రం విరాట్ కోహ్లీని కెప్టెన్ చేయాలని కోరుతున్నారు.

వీ వాంట్ జస్టీస్..

కోహ్లీ సారథ్యంలోనే భారత్ నాలుగు టెస్ట్‌ల్లో 2-1తో నిలిచిందని, చివరి టెస్ట్‌లో కూడా అతని సారథ్యంలోనే బరిలోకి దిగాలన్నాడు. కనీసం ఈ ఒక్క మ్యాచ్‌కైనా అతన్ని కెప్టెన్‌ చేయాలని కోరుతున్నారు. సిరీస్ విజయానికి విరాట్ అర్హుడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. రోహిత్ శర్మ అందుబాటులో లేకుంటే విరాట్ కోహ్లీని కెప్టెన్ చేయడం సరైన నిర్ణయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Story first published: Sunday, June 26, 2022, 11:35 [IST]
Other articles published on Jun 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X