Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కావ్య పాప.. నీ ఫేవరేట్ ప్లేయర్‌కు బాగా బలిసింది!

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యావత్ భారత దేశాన్ని అవమానించిన ట్రావిస్ హెడ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఐసీసీ కోరుతున్నారు. ఐపీఎల్‌లో ఆడకుండా అతనిపై నిషేధం విధించాలని బీసీసీఐని కోరుతున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 14 కోట్ల భారీ ధరకు ట్రావిస్ హెడ్‌ను రిటైన్ చేసుకుంది.

అయితే అతని కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యమారన్‌ను నెటిజన్లు కోరుతున్నారు. 'కావ్య పాప.. మీ ఫేవరేట్ ప్లేయర్‌కు బాగా బలిసింది'అని జుగుప్సాకరమైన రీతిలో కామెంట్ చేస్తున్నారు.

Fans urges SRH owner Kavya Maran to impose strict punishment on Travis Head Ahead of IPL 2025

అసలేం జరిగిందంటే..?
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 184 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ ఔటైన తర్వాత ట్రావిస్ హెడ్ చేసుకున్న సంబరాలు వివాదాస్పదమయ్యాయి. ఓపికగా ఆడుతున్న పంత్‌ను పార్ట్‌టైమ్ బౌలర్ అయిన ట్రావిస్ హెడ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ సంతోషంలో గ్లాస్‌లో ఫింగర్ పెట్టి తిప్పుతున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. అయితే ఈ సంబరాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇది అసభ్యకరమైన సంజ్ఞ అని నెటిజన్లు, మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్లు మాత్రం అతని వేళ్లను మంచు మీద ఉంచాలనే ఒక జోక్‌ను గుర్తు చేసాడని చెబుతున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలో స్పష్టంచేసి, దానిని వినోదభరితంగా వివరిస్తూ నవ్వులు పూయించాడు.

ఆ సెలెబ్రేషన్స్ కథ ఏంటంటే..?
ట్రావిస్ హెడ్ సంబరాలు చాలా అసభ్యకరంగా మనకు కనిపిస్తున్నా.. అది ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్ ఇన్ సైడ్ జోక్ అంట. ఆఫ్ స్పిన్ వేసే ట్రావిస్ హెడ్.. వికెట్ తీసిన ప్రతీసారి డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ గ్లాస్‌లో తన మిడిల్ ఫింగర్ పెట్టి తమ జట్టు స్పిన్నర్ నాథన్ లయన్‌ను ఎగతాళి చేస్తాడంట. 'నేను తక్కువ ఓవర్లు వేసి వికెట్ తీసానని, నా ఫింగర్ రెడ్ హాట్ ఫామ్‌లో ఉంది'అని తెలియజేస్తాడంట. ఈ విషయాన్నే గుర్తు చేసేందుకే ట్రావిస్ హెడ్.. పంత్ ఔటైన వెంటనే గ్లాస్‌లో వేలు పెట్టి తిప్పినట్లు సంబరాలు చేసుకున్నాడు. అయితే భారత్‌లో అసభ్యకరమైన బూతుకు దాన్ని సంజ్ఞగా వాడుతారు.

Story first published: Wednesday, January 1, 2025, 10:31 [IST]
Other articles published on Jan 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+