పంత్.. ఈ ప్రశ్న అడగడానికి! కోహ్లీ, రోహిత్‌కు కూడా ఇంత ధైర్యం ఉండదు!

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన గబ్బా టెస్టులో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన ఈ యువ వికెట్ కీపర్ ప్రస్తుతం ఢిల్లీలో తన కుటుంబంతో కలిసి సమయం గడుపుతున్నాడు. ఐపీఎల్ 2020, ఆసీస్ పర్యటన నేపథ్యంలో దాదాపు నాలుగు నెలల పాటు ఇంటికి దూరంగా ఉన్న పంత్.. ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. ఇక స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపికైన (తొలి రెండు మ్యాచ్‌లు) పంత్ గురువారం ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించాడు.

కొత్త ఇల్లు కొనమని వెంటపడుతున్నారు:
తాను ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నానని.. ఇందుకోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని రిషబ్ పంత్ అభిమానులను కోరాడు. ఇల్లు ఎక్కడ కొంటే బాగుంటుందో చెప్పండని గురువారం ట్వీట్ చేశాడు. 'ఆస్ట్రేలియా పర్యటన నుంచి వచ్చినప్పటి నుంచీ ఇక కొత్త ఇల్లు కొనమని మా ఫ్యామిలీ మెంబెర్స్ వెంట పడుతున్నారు. గుర్గావ్ ఎలా ఉంటుంది? ఇంకా ఏదైనా ఆప్షన్ ఉంటే చెప్పండి' అని టీమిండియా వికెట్ కీపర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సిడ్నీలో సెటిల్ అయిపో:
రిషబ్ పంత్ ట్వీట్‌పై అభిమానులు సరదాగా రిప్లై ఇచ్చారు. 'కోట్లా స్టేడియం దగ్గర తీసుకో.. ఐపీఎల్ టైమ్‌లో సులువు అవుతుంది' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'ఈ ప్రశ్నిను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ట్విటర్‌లో అడిగే ధైర్యం చేయలేరు' అని మరొకరు ట్వీట్ చేశారు. 'పంత్ బయ్యా.. ఆస్ట్రేలియా పౌరసత్వం, ఆధార్ కార్డు తీసుకుని సిడ్నీలో సెటిల్ అయిపో' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఇదిగో నీ ముఖం సరిగ్గా ఇప్పుడు ఇలాగే (అంటే ఇప్పటికిప్పుడు కొంటా అని కాదు.. ఆలోచిస్తా అన్న తరహా మీమ్స్) ఉంటుంది కదా' అని కొంతమంది సరదాగా కామెంట్ చేశారు.

'ప్లేయర్ ఆఫ్ ది మంత్' లిస్టులో పంత్:
సిడ్నీ టెస్టులో రిషబ్ పంత్ 97 పరుగులతో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. ఒత్తిడి అధిగమించి జట్టు మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. అదే విధంగా నాలుగో టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి, అద్భుత ఇన్నింగ్స్‌తో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. ఆసీస్ పర్యటనతో పంత్ ఒక్కసారిగా హీరో అయ్యాడు. సరికొత్తగా ప్రవేశపెట్టిన 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' లిస్టులో పంత్ పేరు పరిశీలనలో ఉన్నట్లు ఐసీసీ బుధవారం తెలిపింది.

ధోనీ కన్నా వేగంగా:
నాలుగో టెస్టులో పంత్ అరుదైన రికార్డు అందుకున్న విషయం తెలిసిందే. భారత్ తరఫున టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. అంతేకాదు టీమిండియా తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌లో (27) వెయ్యి పరుగులు సాధించిన వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. మాజీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ కన్నా పంత్ వేగంగా 1000 రన్స్ చేశాడు. పంత్ 27 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు చేయగా.. మహీ 32 ఇన్నింగ్స్‌లలో 1000 రన్స్ చేసి రెండో స్థానంలో నిలిచాడు.
'బౌండరీలు ఇవ్వడం రవిశాస్త్రికి నచ్చదు.. ఒకవేళ మన బౌలర్లు ఇచ్చారో నేను సచ్చినట్టే'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications