Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: ఈ నోటి దురుసే.. నీ కెరీర్‌ను నాశనం చేసింది! అంబటి రాయుడిపై ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఫైర్!

టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడిపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది.

అసలే తమ అభిమాన జట్టు ఓడిపోయిందనే బాధలో ఉన్న ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు రాయుడు మాటలు మరింత కోపాన్ని తెప్పించాయి. దాంతో సోషల్ మీడియా వేదికగా ఈ స్టార్ ఆటగాడిని ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఏకీపారేస్తున్నారు. జుగుప్సాకరమైన రీతిలో ట్రోల్ చేస్తున్నారు.

Fans trolls Ambati Rayudu for his comments over RCB Loss Against RR in IPL 2024 Eliminator

అసలేం జరిగిదంటే..?
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన కనబర్చిన ఆర్‌సీబీ.. అసాధారణ విజయంతో పాటు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంది. వరుసగా 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి అసాధ్యమనుకున్న ప్లే ఆఫ్స్ బెర్త్‌ను సుసాధ్యం చేసుకుంది. దాంతో ఆర్‌సీబీ ఆటగాళ్లతో పాటు అభిమానులు తెగ సంబరాలు చేసుకున్నారు.

చెన్నై ఓడిపోయిందనే బాధ ఒకవైపు.. ఆర్‌సీబీ సంబరాలు మరోవైపు రాయుడికి ఆగ్రహాన్ని తెప్పించాయి. అప్పుడే ఆర్‌సీబీ విజయాన్ని రాయుడు ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. అంతేకాకుండా ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడాలని కోరుకున్నాడు.

సెలబ్రేషన్స్‌‌కు కప్ ఇవ్వరు..
తాజాగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించడంతో మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. సంబరాలు, దూకుడుతో ఐపీఎల్ ట్రోఫీలను గెలవలేరని, కీలక మ్యాచ్‌ల్లో విజయం సాధించాలని ఎద్దేవా చేశాడు. 'సంబరాలు, దూకుడుతో ఐపీఎల్ ట్రోఫీలు గెలవలేరు. టైటిల్ సాధించాలంటే ప్లేఆఫ్స్‌లో బాగా ఆడాలి. కీలక మ్యాచ్‌లు గెలవాలి' అని రాయుడు అన్నాడు.

ఈ వ్యాఖ్యలు ఆర్‌సీబీ అభిమానులు తీవ్రంగా బాధించాయి. రాయుడు అంతర్జాతీయ క్రికెటర్ ఎలా అయ్యాడో? అర్థం కావడం లేదని, అతను ఇంకా చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడని మండిపడుతున్నారు. ప్లే ఆఫ్స్‌కు ఏ మాత్రం అవకాశం లేని ఓ జట్టు.. అసాధారణ ప్రదర్శనతో వరుస విజయాలు సాధించి ఫలితాన్ని రాబట్టినప్పుడు సంబరాలు చేసుకోవడంలో తప్పు ఏం ఉందని ప్రశ్నిస్తున్నారు.

ఇక రాయుడు ఆర్‌సీబీ సంబరాలను అపార్థం చేసుకున్నాడని, సీఎస్‌కే కాకుండా ఆ పరిస్థితుల్లో మరే జట్టు ఉన్నా అలానే సంబరాలు చేసుకునేవారని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయాన్ని రాయుడు ఎందుకు అర్థం చేసుకలేకపోతున్నాడో తమకు అర్థం కావడం లేదంటున్నారు. ఇలాంటి నోటి దురుసుతోనే రాయుడు తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ట్విటర్ అంబటి రాయుడు ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

Story first published: Thursday, May 23, 2024, 16:52 [IST]
Other articles published on May 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+