Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS 1st T20: ఇదెక్కడి జియోసినిమా రా అయ్యా! హాట్‌స్టార్ ఎంతో నయం!

IND vs AUS 1st T20: జియోసినిమా యాప్‌పై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌కు జియోసినిమా డిజిటల్ బ్రాడ్‌కాస్టర్‌‌గా వ్యవహరిస్తోంది. ఈ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా తొలి టీ20 జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు జియోసినిమా యాప్‌ను ఓపెన్ చేసిన అభిమానులకు ఊహించని షాక్ తగిలింది.

యాప్ ఓపెన్ అయినా మ్యాచ్ లైవ్ ఎంతకూ రాకపోవడంతో అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. ఎర్రర్ 404 వస్తుండటంపై మండిపడుతున్నారు. 2 కోట్ల మందికే యాప్ సర్వర్ స్ట్రక్ అవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

 Fans trolled JioCinema as Live Streaming platform crashes during IND vs AUS 1st T20I

వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌‌ను 5.9 కోట్ల మంది చూసినా యాప్ స్ట్రక్ అవ్వలేదని, జియోసినిమా యాప్ కంటే హాట్ స్టార్ ఎంతో నయమని ప్రశంసిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రపంచకప్ మ్యాచ్‌లను హాట్‌స్టార్‌లో వీక్షించిన అభిమానులు.. జియోసినిమాలో ఎదురవుతున్న అసౌకర్యాన్ని ఇబ్బందిగా ఫీలవుతున్నారు.

యాప్‌ను మధ్యలో ఆపేసి తిరిగి ప్రారంభించాలన్నా.. బ్యాక్ వెళ్లలాన్న ఈ ఇబ్బంది తలెత్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్‌లను ఫ్రీగా ఇవ్వడం కంటే క్వాలిటీ కంటెంట్ అందించడంపై ఫోకస్ పెట్టాలని హితవు పలుకుతున్నారు. జియోసినిమా యాప్ స్ట్రక్ అవ్వడానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. దాంతో ఎక్స్‌లో జియోసినిమా యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం చూపనుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా తాత్కలిక సారథి సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్(13) విఫలమైనా.. జోష్ ఇంగ్లీస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. అతనికి స్టీవ్ స్మిత్ అండగా నిలవడంతో ఆసీస్ 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 151 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.

Story first published: Thursday, November 23, 2023, 20:18 [IST]
Other articles published on Nov 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+