Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధనశ్రీ.. నీ రంకు మొగుడికి చోటు దక్కింది కదా.?

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సతమణి ధనశ్రీ వర్మ మరోసారి ట్రోలింగ్‌కు గురైంది. జుగుప్సాకరమైన కామెంట్లతో నెటిజన్లు ఆమెను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆసియాకప్ 2023 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే.

17 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లు బ్యాకప్ స్పిన్నర్‌గా అక్షర్ పటేల్‌కు అవకాశం ఇచ్చారు. కుల్దీప్ యాదవ్ మెరుగ్గా రాణిస్తుండటంతోనే చాహల్‌ను పక్కనపెట్టామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. సరైన టీమ్ కాంబినేషన్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

Ajit Agarkar

'యుజ్వేంద్ర చాహల్‌ గురించి చర్చించాం. అయితే.. జట్టు సమతూకం కూడా ముఖ్యమే. కుల్దీప్‌ రాణిస్తున్నాడు. అక్షర్‌ పటేల్ ప్రదర్శన బాగుంది. కానీ.. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లను జట్టులోకి తీసుకోవడం కష్టం. అందుకే చాహల్‌‌‌ను పక్కనపెట్టాల్సి వచ్చింది'అని తెలిపాడు. జట్టులో చోటు దక్కకపోవడంపై చాహల్ స్పందించాడు.

నాలుగేళ్ల క్రితం జట్టులో చోటు దక్కనప్పుడు రోహిత్ శర్మ చేసిన ట్వీట్‌నే చాహల్ ఏమోజీలతో పంచుకున్నాడు. 'కారు మబ్బులను చీల్చుకుంటూ సూర్యుడు ఉదయిస్తాడు'అని ఏమోజీలతో పేర్కొన్నాడు. తాను కూడా నేలకు కొట్టిన బంతిలా తిరిగి వస్తానని సెలెక్టర్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మకు సవాల్ విసిరాడు.

Dhanashree Verma Chahal

ఇక అతని సతీమణి ధనశ్రీ వర్మ కూడా చాహల్‌ను ఎంపిక చేయకపోవడంపై స్పందించింది. పరోక్ష వ్యాఖ్యలతో సెలెక్టర్లపై సెటైర్లు పేల్చింది.'చెప్పినట్లు వింటూ సిగ్గరిగా ఉంటే మన కెరీర్ ఎదుగుదలకు నష్టం జరుగుతుందా? లేదంటే మనందరం కూడా ఉత్సాహంగా మారిపోయి, మాటకారి తనంతో జీవితంలో ఎదగడం నేర్చుకోవాలా? అని చాలా సీరియస్‌గా ఆలోచించడం మొదలు పెట్టా' అని సెటైరికల్‌ పోస్ట్ పెట్టింది.

Dhanashree Verma

అయితే ఈ పోస్ట్‌పై కొందరు అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. చాహల్‌కు చోటు దక్కకపోయినా.. రంకు మొగుడైన శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దక్కింది కదా? అని ప్రశ్నిస్తున్నారు.

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీ వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. చాహల్‌ లేకుండా శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీ వర్మ పలు పార్టీలకు హాజరవ్వడం, చనువుగా ఉండటం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు.. రంకు మొగుడికి చోటు దక్కిన తర్వాత ఇంత బాధ ఎందుకని ధనశ్రీ వర్మను ప్రశ్నిస్తున్నారు.

Story first published: Tuesday, August 22, 2023, 18:05 [IST]
Other articles published on Aug 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+