Vaibhav Sooryavanshi: ఆ బౌలర్లు ఉంటేనే బుడ్డోడు చెలరేగుతాడు!
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పరుగుల విధ్వంసానికి బ్రేక్ పడింది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ 15 ఏళ్ల బుడ్డోడు వరుస మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్మురేపిన యూనివర్సల్ బాస్.. వైభవ్ సూర్యవంశీ లిస్ట్-ఏ క్రికెట్‌లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోతున్నాడు.
భారత్-ఏ తరఫున శ్రీలంక పర్యటనకు వెళ్లిన వైభవ్ సూర్యవంశీ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 14 బంతుల్లో 21 పరుగులే చేసి వెనుదిరిగాడు. 150 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన వైభవ్ 3 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. సహన్ అరాచ్చిగే బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. తనకు లభించిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మల్చలేకపోతున్నాడు.

వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉంటేనే..
ఈ ముక్కోణపు సిరీస్‌లో వైభశ్ సూర్యవంశీ మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఒక్క ఇన్నింగ్స్‌లోనూ చెప్పుకోదగ్గ రీతిలో బ్యాటింగ్ చేయలేదు. శ్రీలంక-ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లో 14 పరుగులే చేసిన వైభవ్.. అఫ్గాన్-ఏతో జరిగిన రెండో మ్యాచ్‌లో 44 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్లు పారేసుకుంటున్నాడు.
వైభవ్ సూర్యవంశీ వైఫల్యంపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. ప్యాట్ కమిన్స్, జస్‌ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్ వుడ్, కగిసో రబడా, మిచెల్ స్టార్క్, మహమ్మద్ సిరాజ్ వంటి వరల్డ్ క్లాస్ పేసర్లు ఉంటేనే బుడ్డోలు చెలరేగుతాడని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. మరికొందరు మాత్రం బుడ్డోడి ప్రతాపం భారత్ పిచ్‌లపైనేనని, స్పిన్ ట్రాక్స్‌పై ఆడలేడని విమర్శిస్తున్నారు. ఫ్లాట్ వికెట్స్‌పై దంచి కొట్టే వైభవ్.. స్పిన్ ట్రాక్‌లపై రాణించలేకపోతున్నాడని కామెంట్ చేస్తున్నారు.
అరంగేట్రంపై ప్రభావం.
ఏది ఏమైనా ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ వేదికపై ఇలా వరుసగా విఫలమవ్వడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ పర్యటనలో వైభవ్ సూర్యవంశీ రాణించకపోతే.. అతని అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైభవ్ సూర్యవంశీ వైఫల్యం భారత్-ఏ విజయవకాశాలను కూడా ప్రభావితం చేస్తోంది. శ్రీలంక-ఏతో గత మ్యాచ్‌లో గెలిచిన భారత్.. అఫ్గాన్-ఏ చేతిలో ఓటమిపాలైంది. తాజా మ్యాచ్‌లో ఓడితే ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారనున్నాయి.
ఐపీఎల్ ప్రదర్శనతో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు వైభవ్ సూర్యవంశీ ఎంపికైన సంగతి తెలిసిందే. జూన్ 26న ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. కానీ భారత్-ఏ తరఫున వరుసగా విఫలమవుతుండటంతో అతనికిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ అవకాశాలు ఇచ్చేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ వెనకడుగు వేయవచ్చని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

