Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: మ్యాచ్‌లన్నీ గంగపాలు! క్రికెట్ ఆస్ట్రేలియాకు భారీ బొక్క! పేలుతున్న సెటైర్లు!

Fans troll ICC after rain interrupted T20 World Cup 2022 Matches

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022లో వరణుడి జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీలో పాల్గొన్న జట్లు సాధించిన విజయాలకంటే వర్షంతో తుడిచిపెట్టుకుపోయిన మ్యాచ్ సంఖ్యే ఎక్కువ అయ్యింది. శుక్రవారం మెల్ బోర్న్ వేదికగా జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షార్పణం అయ్యాయి. ఒక్క బంతి కూడా పడకుండానే రెండు మ్యాచ్‌లు తుడిచిపెట్టుకుపోయాయి. వర్షం కారణంగా అటు అభిమానులు..ఇటు ఆతిథ్య క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్ర నిరాశకు గురైంది. ఇప్పటి వరకు మొత్తం నాలుగు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దవ్వడంతో ఐసీసీతో పాటు ఐసీసీకి భారీ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే వర్షంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సరదా మీమ్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు.

ఐసీసీతో వర్షం సంబంధం విడదీయరానిది..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి వర్షానికి విడదీయలేని బంధం ఉందని, వీరి మధ్య భార్యభర్తలకు మించిన అనురాగం, అప్యాయతలున్నాయని నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఐసీసీ నిర్వహించే ప్రతీ టోర్నీలో వర్షం వస్తుందని, తద్వారా ఆతిథ్య దేశంతో పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని కామెంట్ చేశారు. విజయం కోసం ఇరు జట్లలోని 11 మంది ఆటగాళ్లు సిద్దమయితే.. ఎక్స్‌ట్రా ప్లేయర్‌గా వర్షం బరిలోకి దిగుతుందని సెటైర్లు పేల్చుతున్నారు.

సెమీస్‌కు ఐర్లాండ్, జింబాబ్వే..

ఐర్లాండ్, జింబాబ్వే జట్లు సెమీస్ చేరేందుకు వర్షం సహకరిస్తుందని, మరో నాలుగు మ్యాచ్‌లు మింగేస్తే ఈ రెండు జట్లు నాకౌట్‌లో తలపడతాయని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఈ రోజు జరగాల్సిన రెండు మ్యాచ్‌ల్లో వర్షమే గెలిచిందని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. అసలు సిసలు మ్యాచ్‌లన్నీ వర్షం కారణంగా రద్దవుతుండటం తమను తీవ్రంగా నిరాశపరుస్తుందని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఐసీసీకి బుద్ది లేదు..

వర్షాలు పడే సమయమని తెలిసినా... ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022ను షెడ్యూల్ చేయడం సిగ్గు చేటని, గత అనుభవాలను నుంచి ఏం నేర్చుకోలేదని మండిపడుతున్నారు. ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు పడుతాయని తెలిసినా అక్కడే టోర్నీ నిర్వహించడం సరికాదని మండిపడుతున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా, ఐసీసీ ఈ నిర్లక్ష్య వైఖరి పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ను నిర్వహించడంలో చేతులెత్తేసిందని, దీన్ని గంగపాలు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ మైఖెల్ వాన్ క్రికెట్ ఆస్ట్రేలియా తీరును తప్పుబట్టాడు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం వర్షా కాలం కొనసాగుతోందని, అయినా కనీస జాగ్రత్తలను తీసుకోలేదని మండిపడ్డాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌కు రూఫ్ కవర్ సౌకర్యం ఉన్నా ఎందుకు వినియోగించలేదని నిలదీశారు.

Story first published: Friday, October 28, 2022, 17:25 [IST]
Other articles published on Oct 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+