టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి మొండి చెయ్యే ఎదురైంది. ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్‌కు దూరం పెట్టిన సెలెక్టర్లు.. తాజాగా ఆసియాకప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కూడా చోటివ్వలేదు. ఐపీఎల్ 2025 సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసినా.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టాప్ స్కోరర్‌గా నిలిచినా పట్టించుకోలేదు. మంగళవారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను వెల్లడించాడు.
జస్‌ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్, శివమ్ దూబే రీఎంట్రీ ఇవ్వగా.. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాకప్ వికెట్ కీపర్‌గా జితేష్ శర్మకు చోటు దక్కింది. శుభ్‌మన్ గిల్ తిరిగి వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు.

అయితే ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడంపై అజిత్ అగార్కర్‌ను ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రేయస్ అయ్యర్ కోసం జట్టులో ఎవర్నీ తప్పించాలని? ఎదురు ప్రశ్నించాడు. దురదృష్టవశాత్తు అయ్యర్‌కు అవకాశం దక్కలేదన్నాడు. తాము 15 మంది సభ్యులను మాత్రమే ఎంపిక చేయగలమని, ప్రస్తుత పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్‌కు చోటు లేదన్నాడు.
అయితే ఈ వ్యాఖ్యలు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఎవర్నీ తప్పించి శుభ్‌మన్ గిల్‌ను జట్టులోకి తీసుకున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జట్టులో చోటు దక్కించుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్‌తో సహా తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లు అయ్యర్ కంటే మెరుగ్గా ఆడుతారా? అని నిలదీస్తున్నారు. హెడ్ కోచ్ గౌతం గంభీర్ రాజకీయాలకు శ్రేయస్ అయ్యర్‌ను బలి చేస్తున్నారని మండిపడుతున్నారు.
ప్రస్తుతం ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన జట్టులో శ్రేయస్ అయ్యర్ కంటే మెరుగైన ప్రదర్శన చేసింది శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ మాత్రమే. అయ్యర్ అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా దుమ్మురేపాడు. 17 మ్యాచ్‌ల్లో 50.33 సగటుతో 604 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా పంజాబ్ కింగ్స్‌ను 11 ఏళ్ల తర్వాత ఫైనల్ చేర్చాడు. దుబాయ్ వేదికగానే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్పిన్‌కు అనుకూలంగా ఉండే దుబాయ్ వికెట్‌పై మిడిలార్డర్‌లో సమర్థవంతంగా ఆడే నైపుణ్యం శ్రేయస్ అయ్యర్‌కు ఉంది. అయినా కూడా అతన్ని సెలెక్టర్లు పట్టించుకోకపోవడం దారుణమని, గంభీర్ వ్యూహంలో భాగంగానే అతన్ని తప్పించారని నెటిజన్లు మండిపడుతున్నారు.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
స్టాండ్‌బై ప్లేయర్స్
ప్రసిధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్