Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బామ్మర్ధి పెళ్లి కోసం తొలి వన్డేకు రోహిత్ శర్మ డుమ్మా! మండిపడుతున్న ఫ్యాన్స్!

 Fans slams Rohit Sharma for he will miss the first ODI vs Australia due to his brother-in-law wedding

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం కంటే వ్యక్తిగత పనులే హిట్‌మ్యాన్‌కు ఎక్కువయ్యాయని మండిపడుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ముంబై వేదికగా జరగనున్న తొలి వన్డేకు రోహిత్ శర్మ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్ ఆడలేనని నెల రోజుల ముందే బీసీసీఐకి సమాచారమిచ్చాడు. దాంతో హార్దిక్ పాండ్యా తొలి వన్డేలో జట్టును నడిపించనున్నాడు. అయితే బామ్మర్ది పెళ్లి కోసం రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడటం లేదనే విషయం తాజాగా స్పష్టమైంది.

రితికా సోదరుడి వివాహం..

రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే సోదరుడు కునాల్ సజ్దే వివాహం కోసం ఆస్ట్రేలియాతో తొలి వన్డే నుంచి హిట్ మ్యాన్ తప్పుకున్నాడు. కునాల్ సజ్దే వివాహం నేపథ్యంలో నిర్వహించిన సంగీత్, హాల్దీ ఫంక్షన్ల ఫొటోలను రితికా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ వేడుకలకు రోహిత్ శర్మ కూడా హాజరయ్యాడు. ఆసీస్‌తో మ్యాచ్ జరిగే రోజే కునాల్ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. దాంతోనే రోహిత్ తొలి వన్డేకు దూరమయ్యాడని అతని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

బామ్మర్ది పెళ్లి ఎక్కువా..?

అయితే దేశం కంటే బామ్మర్ది పెళ్లి ఎక్కువైందా? అని రోహిత్ శర్మను అభిమానులు నిలదీస్తున్నారు. అతి ముఖ్యమైన మ్యాచ్‌ను కాదని బామ్మర్ది పెళ్లికి పోవడం భావ్యం కాదని మండిపడుతున్నారు. ఈ విషయంలో మహేంద్ర సింగ్ ధోనీని చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. సొంత బిడ్డ పుట్టినప్పుడు కూడా ధోనీ జట్టుతోనే ఉన్నాడని, దేశం తరఫున ఆడుతున్నప్పుడు ఇలాంటివి తప్పవని అపట్లో మహీ చేసిన వ్యాఖ్యలను ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.

వన్డే కెప్టెన్సీ కూడా గోవిందా..

వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ ముఖ్యమని, ఆ విషయం అర్థం చేసుకోకుండా పెళ్లి పేరంటాలు తిరిగితే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. వన్డే కెప్టెన్సీ కూడా పోతుందని హెచ్చరిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ అయినా పెళ్లాం ముందు పిల్లేననే విషయం స్పష్టమైందని మరికొందరు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. పెళ్లికి రావాలని రాధిక సజ్దే ఆదేశాలు ఇవ్వడంతో రోహిత్.. మ్యాచ్‌కు డుమ్మా కొట్టిమరీ ఆమె కొంగుచాటు చేరాడని విమర్శిస్తున్నారు. రోహిత్ కూడా పెళ్లాం కొంగు చాటు మొగుడేనని ఎద్దేవా చేస్తున్నారు.

కెప్టెనే ఇలా అయితే ఎలా..?

ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ జరగనుండటంతో.. రోహిత్ శర్మ అన్ని మ్యాచ్‌లు ఆడాలని.. అప్పుడే జట్టు కూర్పు, సన్నద్ధత బాగుంటుందని అజిత్ అగార్కర్ లాంటి మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ కెప్టెన్‌గా విజయం సాధిస్తే.. వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టు పగ్గాలను అందుకుంటాడని సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. ఆడబిడ్డ హోదాలో ఐరెన్లు పట్టనికి రోహిత్ పోయాడని సెటైర్లు పేల్చుతున్నారు. మరికొందరు మాత్రం రోహిత్ శర్మకు అండగా నిలుస్తున్నారు. ప్రతీ ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుందని, వారిని గౌరవించాలని సూచిస్తున్నారు.

Story first published: Wednesday, March 15, 2023, 15:37 [IST]
Other articles published on Mar 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+