Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేఎల్ రాహుల్ కోసం ఇషాన్ కిషన్ బలి.. డబుల్ సెంచరీ చేసినా నో ప్లేస్! మనం ప్రపంచకప్ గెలిచినట్లే!

Fans Slams Rohit Sharma after he confirms Shubman Gill will open in 1st ODI against Sri Lanka

న్యూఢిల్లీ: శ్రీలంకతో తొలి వన్డేలో తనతో కలిసి శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేస్తాడని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. దురదృష్టవశాత్తు డబుల్ సెంచరీ చేసినా ఇషాన్ కిషన్‌కు జట్టులో చోటిచ్చే పరిస్థితి లేదని చెప్పాడు. టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయంలో భాగంగానే అతన్ని పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. గత 7-8 నెలలుగా వన్డేల్లో శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించాడని, అతనికి వరుస అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పాడు. గువహతి వేదికగా మంగళవారం జరగనున్న తొలి వన్డే నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రోహిత్.. టీమ్ కాంబినేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇషాన్ కిషన్ వేటు వెనుక కుట్ర..

అయితే ఇషాన్ కిషన్ తప్పించడం వెనుక పెద్ద కుట్ర ఉందని భారత అభిమానులు మండిపడుతున్నారు. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కోసం ఇషాన్ కిషన్‌కు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలు రాహుల్‌ను తుది జట్టులో ఆడించడం కోసం ఇషాన్ కిషన్‌ను బలిచేస్తున్నారని మండిపడుతున్నారు. బంగ్లాదేశ్ పర్యటనలో రాక రాక వచ్చిన అవకాశంతో డబుల్ సెంచరీ బాదిన ఇషాన్..తన సత్తా ఏంటో చూపించాడు. రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత అతని స్థానాన్ని ఇషాన్ కిషన్ మాతమ్రే భర్తీ చేయగలడని క్రికెట్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు.

రాహుల్ కోసం..

ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ నేపథ్యంలో శిఖర్ ధావన్‌పై కూడా సెలెక్టర్లు వేటు వేసారు. టీ20 సిరీస్‌లో పర్వాలేదనిపించిన ఇషాన్ కీపింగ్‌లో అదరగొట్టాడు. అయితే వన్డే సిరీస్‌లో రాహుల్‌ను తుది జట్టులో ఆడించడం కోసం ఇషాన్ కిషన్‌ను టీమ్‌మేనేజ్‌మెంట్ పక్కనపెట్టాలని నిర్ణయించింది. వికెట్ కీపర్ అయిన ఇషాన్‌ను పక్కనపెడితే కీపింగ్ పేరిట రాహుల్‌ను జట్టులో ఇరికించవచ్చని రాహుల్ ద్రవిడ్, రోహిత్ ప్లాన్ చేశారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆ క్రమంలోనే ఓపెనర్‌గా శుభ్‌మన్‌ను బరిలోకి దించుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అట్లుంటది టీమిండియాతో..

డబుల్ సెంచరీ బాదినా జట్టులో చోటు దక్కకపోవడం అన్యాయమని, ఏ దేశంలో ఇలా జరగదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరుణ్ నాయర్ పట్ల ఇలానే వ్యవహరించి అతని కెరీర్ నాశనం చేశారని, ఇప్పుడు ఇషాన్ కిషన్ పరిస్థితి కూడా అదేనని మండి పడుతున్నారు. లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టడం బుద్ది తక్కువ నిర్ణయమని, అసలు ఇషాన్ కిషన్‌ను ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారని నిలదీస్తున్నారు. ఇలా అయితే వరల్డ్ కప్ గెలిచినట్లేనని మరోకరు సెటైర్లు పేల్చుతున్నారు.

Story first published: Monday, January 9, 2023, 22:42 [IST]
Other articles published on Jan 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+