For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారి మోజులో పడి నటాషాను మోసం చేసిన హార్దిక్ పాండ్యా?

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్ తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నామని ఈ జంట ప్రకటించింది. విడిపోయినా.. తమ కుమారుడు అగస్త్యకు కో-పేరెంట్స్‌గా వ్యవహరిస్తామని తెలిపింది.

చాలా అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్-నటాసా ఇలా విడిపోతారని ఎవరూ అనుకోలేదు. కొన్నేళ్ల పాటు సహజీవనం చేసిన నటాషా, హార్దిక్ మే 2020లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అప్పటికే నటాషా గర్భవతి.

Fans Slams Hardik Pandya after Natasa Stankovic Likes Cheating In Relationship Post

ఫిబ్రవరి 2023లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఈ జంట మరోమారు పెళ్లి చేసుకుంది. అనివార్య కారణాలతో జులై 2024లో విడిపోతున్నట్టు ఈ జంట ప్రకటించింది. అయితే, కుమారుడు అగస్త్యకు తామిద్దరం కో పేరెంట్స్‌గా కొనసాగుతామని చెప్పారు. వివాహేతర సంబంధాలే ఈ ఇద్దరు విడిపోవడానికి ప్రధాన కారణమనే ప్రచారం జోరుగా సాగింది.

హార్దిక్‌ పాండ్యాకు తెలియకుండా నటాషా సీక్రెట్ ఎఫైర్ నడిపిందని, ఈ విషయాన్ని పసిగట్టిన హార్దిక్ ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడని, ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే తాజాగా రిలేషన్‌షిప్‌లో మోసం గురించే తెలియజేసే ఇన్‌స్టా రీల్‌‌ను నటాషా లైక్ చేయడం కొత్త చర్చకు తెరలేపింది.

హార్దిక్ పాండ్యానే నటాషాను మోసం చేశాడనే వాదన వినిపిస్తోంది. పలువురు హీరోయిన్లు, సెలెబ్రిటీల మోజులో పడిన హార్దిక్ పాండ్యా.. నటాషాకు తగిన టైమ్ ఇవ్వలేదని తెలుస్తోంది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన హార్దిక్ పాండ్యా.. కొడుకు, సతీమణిని పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని, హార్దిక్ వివాహేతర సంబంధాలను నటాషా నిలదీసిందని తెలుస్తోంది.

గొడవ పడలేకనే ఇద్దరూ విడాకులు తీసుకున్నారని హార్దిక్ పాండ్యాకు సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి మీడియాకు తెలిపినట్లు ఓ జాతీయ వెబ్‌సైట్ పేర్కొంది. హార్దిక్ పాండ్యాతో విడాకుల తర్వాత సెర్బియా వెళ్లిపోయిన నటాషా.. తన కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ఈ వారం మొదట్లో ముంబైకి వచ్చిన నటాషా.. కుమారుడిని హార్దిక్‌కు అప్పగించి మోడలింగ్ కోసం హాట్ ఫొటో షూట్‌లో పాల్గొంది.

ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలు అభిమానుల మతులు పోగొడుతున్నాయి. పక్షి ఈకలు అద్దిన ఈ వైట్ థై గౌన్‌, మ్యాచింగ్ హాల్స్ ధరించిన నటాషా హాట్‌గా దర్శనమిచ్చింది.

Story first published: Tuesday, September 10, 2024, 22:19 [IST]
Other articles published on Sep 10, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+