Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను పక్కపెడితే ఇలానే ఉంటుంది!

వరల్డ్ ఛాంపియన్‌ టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం ఆడిన తొలి మ్యాచ్‌లోనే టీమిండియా ఓటమిపాలైంది. పసికూన ఐర్లాండ్ చేతిలో అయ్యర్ సేన ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. శుక్రవారం జరిగిన తొలి టీ20లో సమష్టిగా రాణించిన ఐర్లాండ్ 34 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించింది. మిడిల్ ఓవర్ల బౌలింగ్, బ్యాటింగ్ వైఫల్యం, చెత్త ఫీల్డింగ్ టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసాయి.

గంభీర్ లాంటి షాడిస్ట్ కోచ్ కాదు.. ధోనీలాంటి మెంటార్ కావాలి: శ్రీశాంత్

గంభీర్ లాంటి షాడిస్ట్ కోచ్ కాదు.. ధోనీలాంటి మెంటార్ కావాలి: శ్రీశాంత్

అయితే ఈ మ్యాచ్‌‌లో టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ మ్యాచ్ ముందు వరకు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం అంటూ బ్రాడ్‌కాస్టర్‌తో పాటు బీసీసీఐ హైప్ క్రియేట్ చేసింది. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైభవ్ సూర్యవంశీని బెంచ్‌పైనే కూర్చోబెట్టాడు. 15 ఏళ్ల యువ ఆటగాడి కోసం టీమ్‌లో సెట్ అయిన ఆటగాళ్లను తప్పించడం సరికాదని పరోక్షంగా వెల్లడించాడు. సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చాడు.

Fans Slams Gautam Gambhir After India s Embarrassing Loss to Ireland in 1st T20I
Photo Credit: X (twitter)

కానీ ఆ సీనియర్లు టీమిండియాను నట్టేట ముంచారు. ఏకంగా ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దాంతో గంభీర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని కాదని, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లను ఆడిస్తే ఏమైంది? అని నిలదీస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగి ఉంటే పవర్ ప్లేలోనే మ్యాచ్‌ను లాగేసుకునేవాడని కామెంట్ చేస్తున్నారు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ 776 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరెంజ్ క్యాప్‌తో పాటు మొత్తం ఐదు అవార్డులను సొంతం చేసుకున్నాడు. శ్రీలంక-ఏతో ముక్కోణపు వన్డే సిరీస్‌లోనూ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. అయినా అతన్ని గంభీర్‌ బెంచ్‌కే పరిమితం చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను పక్కనపెడితే ఫలితాలు ఇలానే ఉంటాయని గంభీర్‌ను ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. కనీసం రెండో టీ20లోనైనా వైభవ్ సూర్యవంశీని ఆడించాలని గంభీర్‌కు సూచిస్తున్నారు.

పంతం నెగ్గించుకున్న గంభీర్..పాపం బుడ్డోడు డ్రింక్స్ బాయ్‌గా..!

పంతం నెగ్గించుకున్న గంభీర్..పాపం బుడ్డోడు డ్రింక్స్ బాయ్‌గా..!

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌పై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం. ఇప్పటి వరకు 9 టీ20లు, 3 వన్డేలు ఆడిన ఐర్లాండ్‌ 11 ప్రయత్నాల తర్వాత భారత్‌ను ఓడించింది. దాంతో ఆ జట్టుకు ఇది చారిత్రాత్మక విజయంగా నిలిచిపోయింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.

Story first published: Saturday, June 27, 2026, 11:26 [IST]
Other articles published on Jun 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+