India Squad of Asia Cup: సంజూ శాంసన్ ఏం తప్పు చేశాడు.. స్టాండ్‌బైగా కూడా పనికిరాడా?

న్యూఢిల్లీ: ఆసియాకప్ 2022 బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను చేతన శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ సోమవారం వెల్లడించింది. ఇంగ్లండ్ పర్యటన తర్వాత ఆటకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చారు. ఫుల్ టైమ్ కెప్టెన్ అయిన తర్వాత రోహిత్ శర్మకు ఇది బిగ్ టోర్నీ కాగా.. అతనికి రాహుల్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. గాయాల కారణంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ టీమ్‌కు దూరమయ్యారు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్‌లను సెలెక్టర్లు స్టాండ్‌బైగా తీసుకున్నారు. విండీస్ పర్యటనకు ఎంపికైన ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఉద్వాసనకు గురయ్యారు.
సూర్య ఉండటంతో..
అయితే రాహుల్ గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తూ చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో టీమ్‌మేనేజ్‌మెంట్ బ్యాకప్ ఓపెనర్‌ను తీసుకోలేదు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ తిరిగి రావడంతో మిడిలార్డర్స్ ఆప్షన్స్ కూడా ఎక్కువయ్యాయి. పార్టటైమ్ బౌలర్ కోటా దీపక్ హుడా జట్టులో చోటు దక్కించుకోగా.. వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు చోటు లేకుండా పోయింది. రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌ల రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉండటంతో సంజూకు ఆప్షన్ లేకుండా పోయింది. అయితే నిలకడగా రాణించిన సంజూకు చోటివ్వకపోవడం దారుణమని అతని అభిమానులు ఆరోపిస్తున్నారు.
సంజూపై వివక్ష..
సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ తీరుతో పాటు సెలెక్షన్ కమిటీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అతని పట్ల ఓ రకమైన వివక్ష చూపిస్తున్నారని, ఏనాడు అతనికి అండగా నిలవలేదని కామెంట్ చేస్తున్నారు. ప్రతీ సారి అభిమానుల విమర్శలతో జట్టులోకి తీసుకోవడం.. తుది జట్టులోకి తీసుకోకుండా బెంచ్‌పై కూర్చోబెట్టడం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఆఖరి మ్యాచ్..విండీస్ పర్యటనలో చివరి మ్యాచ్‌లో అవకాశమిచ్చారని, రాణించినా పక్కనపెట్టేసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం స్టాండ్ బై ప్లేయర్‌గా కూడా సంజూ పనికిరాడా? అంటూ మండిపడుతున్నారు.
పాపం ఇషాన్ కిషన్..
ఇక ఇషాన్ కిషన్ పరిస్థితి మరీ దారుణమని, అతన్ని పూర్తిగా పక్కనపెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. నిలకడగా రాణించే యువ ఆటగాళ్లలో అతనొక్కడని, పృథ్వీ షా తరహాలోనే అతని అంతర్జాతీయ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఫామ్ కంటే ఆటగాళ్ల హోదానే పరిగణలోకి తీసుకున్నారని, గాయం నుంచి కోలుకున్న రాహుల్‌ను నేరుగా జట్టులోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలా అయితే దీపక్ చాహర్‌ను కూడా తీసుకోవాల్సిందని, టీమ్‌లో ఒక్కో ప్లేయర్‌కు ఒక్కో రూలా? అంటూ మండిపడుతున్నారు.
తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవిబిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications