Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: టీమిండియా కొంపముంచిన రవీంద్ర జడేజా! (వీడియో)

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా‌పై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జడేజా కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తరహాలోనే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో జడేజా దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో 11 పరుగులు మాత్రమే చేసిన జడేజా.. ఫీల్డింగ్‌లో లడ్డూ లాంటి క్యాచ్‌ను నేలపాలు చేశాడు.

జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ బెన్ డకెట్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను జడేజా వదిలేసాడు. బుమ్రా వేసిన ఏడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ చివరి బంతి డకెట్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బ్యాక్‌వార్డ్ పాయింట్‌ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జడేజా క్యాచ్‌ను అందుకోలేకపోయాడు.

Fans Slam Ravindra Jadeja After Dropped Sitter in England vs India 1st Test
Photo Credit: X (twitter)

నేరుగా జడేజా చేతుల్లో పడి మరి బంతి చేజారింది. బుమ్రా వేసిన ఏడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్యాచ్ పట్టి ఉంటే బెన్ డకెట్ 15 పరుగులకే వెనుదిరిగేవాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను 68 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఓలిపోప్‌తో కలిసి రెండో వికెట్‌కు 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. జడేజానే ఆ క్యాచ్ పట్టి ఉంటే ఇంగ్లండ్ 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయేది. తన తొలి ఓవర్‌లోనే బుమ్రా.. మరో ఓపెనర్ జాక్ క్రాలీని పెవిలియన్ చేర్చాడు. జడేజా క్యాచ్ డ్రాప్‌తో చెలరేగిన బెన్ డకెట్‌ను బుమ్రానే స్టన్నింగ్ డెలీవరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు.క్రీజులోకి జోరూట్ రాగా.. ఓలీ పోప్(60 బ్యాటింగ్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. 31 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లకు 129 పరుగులు చేసింది.



అంతకుముందు 359/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌..మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 134), శుభ్‌మన్ గిల్(227 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్‌తో 147), యశస్వి జైస్వాల్(159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(4/86), బెన్ స్టోక్స్(4/66) నాలుగేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్ ఓ వికెట్ పడగొట్టాడు.
Story first published: Saturday, June 21, 2025, 22:33 [IST]
Other articles published on Jun 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+