BAN vs AUS: ఏందిరా ఈ ఎచ్చిడి!
వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాను ఓడించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఢాకా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతి ద్వారా 86 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. సొంతగడ్డపై వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం బంగ్లాదేశ్‌కు ఇదే తొలిసారి. 2005లో కార్టిఫ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ తొలిసారిగా ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. సుమారు 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై రెండో విజయాన్ని కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ గెలుస్తున్నామన్న గర్వమో లేక పొగరో తెలియదు కానీ బంగ్లాదేశ్ బౌలర్ నహిద్ రాణా మైదానంలో అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ జోష్ ఇంగ్లిస్‌తో వాగ్వాదానికి దిగాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతికే జోష్ ఇంగ్లిస్ ఔటయ్యాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అయితే ఇంగ్లీస్ పెవిలియన్ వైపు వెళ్తున్నతరుణంలో నహీద్ రానా నోటికి పనిచెప్పాడు. అది విన్న ఇంగ్లిస్ నేరుగా నహీద్ రానావైపు దూసుకొచ్చి ఘాటుగా బదులిచ్చాడు. బంగ్లా కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ జోక్యం చేసుకొని ఇంగ్లీస్‌ను అక్కడి నుంచి పంపించేశాడు.
ఆ తర్వాత నహీరానా వద్దకు వచ్చిన మెహదీ హసన్.. ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలని చెప్పడం స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. బంగ్లా పేసర్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఏందిరా ఈ ఎచ్చిడి'అని ఒకరంటే.. స్లెడ్జింగ్ నేర్పిన ఆసీస్‌తోనే ఆటలా అని కామెంట్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్ 284/8
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 284 పరుగులు చేసింది. తంజిద్ హసన్(44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 54), నజ్ముల్ హొస్సేన్ షాంటో(86 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 67), మోసాడెక్ హోస్సేన్(70 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా.. లియామ్ స్కాట్, మ్యాట్ రేన్‌షా రెండేసి వికెట్లు తీసారు. గ్జేవియర్ బార్ట్‌లెట్ ఒక వికెట్ పడగొట్టాడు.
వర్షం అంతరాయం..
అనంతరం ఆస్ట్రేలియా వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 42.2 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులే చేసింది. ఆ తర్వాత వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని తేల్చారు. అలెక్స్ క్యారీ(62 బంతుల్లో 5 ఫోర్లతో 47), కామెరూన్ గ్రీన్ (66 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 52 నాటౌట్), కూపర్ కనోల్లీ(50 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35) మినహా అంతా విఫలమయ్యారు.
బంగ్లా బౌలర్లలో నహిద్ రాణా(4/41) నాలుగు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, మొసాడెక్ హుస్సేన్(2/37) రెండేసి వికెట్లు పడగొట్టారు. టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications