Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC 2025: కెప్టెన్ బవుమానా? జై షానా? అంత బిల్డప్ ఎందుకు..?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025‌ను సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాతో ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 27 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ అందుకుంది. టెంబా బవుమా సారథ్యంలో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది.

ఎయిడెన్ మార్క్‌రమ్(207 బంతుల్లో 14 ఫోర్లతో 136) అద్భుత శతకంతో పాటు టెంబా బవుమా(134 బంతుల్లో 5 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీతో సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా తమపై పడిన చోకర్స్ అనే ముద్రను కూడా చెరిపేసుకుంది. ఈ విజయంతో టెంబా బవుమాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది.

సౌతాఫ్రికా జట్టుకు పూర్తి స్థాయి మొట్ట మొదటి నల్ల జాతి కెప్టెన్ బవుమా. ఇప్పటి వరకు తన సారథ్యంలో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా సౌతాఫ్రికా ఓడిపోలేదు. పైగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం.. బవుమా ప్రత్యేకత. సౌతాఫ్రికా తరఫున ఏ శ్వేత జాతి కెప్టెన్ కూడా సాధించలేనిది బవుమా సాధించాడు. దాంతో అతన్ని నెటిజన్లు ప్రత్యేకంగా కొనియాడారు.

Fans Slam ICC Over Jay Shah Close-Ups in South Africa WTC Tribute Video

సౌతాఫ్రికా విజయాన్ని ఉద్దేశించి ఐసీసీ.. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పంచుకుంది. అయితే ఈ వీడియోలో జై షా కనిపించడంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాట్ పట్టడం కూడా చేతకాని జై షాకి అంత బిల్డప్ ఎందుకు..?అని ప్రశ్నిస్తున్నారు.

ఈ వీడియోలో సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా కంటే జై షా క్లిప్పులే ఎక్కువ ఉన్నాయని మండిపడుతున్నారు. సినిమాటిక్ లెవెల్‌లో జై షా క్లోజప్ షాట్స్ తీసి మరీ.. ఆ వీడియోలో ఐసీసీ ఇరికించేసిందని, అతనేమైనా సౌతాఫ్రికా తరఫున క్రికెట్ ఆడాడా? పోనీ ఆ జట్టుకి కోచ్‌గా వ్యవహరించాడా? అని నిలదీస్తున్నారు. బ్యాట్ చేత పట్టి జైషానే సౌతాఫ్రికా జట్టుని గెలిపించినట్టు.. 45 సెకన్ల వీడియోలో 11 క్లిప్స్ జోడించడం ఏంటని తప్పుబడుతున్నారు. ఐసీసీ ఛైర్మన్ అయినంత మాత్రాన.. బవుమా కన్నా జై షాకి ఎక్కువ బిల్డప్ ఇస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

Story first published: Tuesday, June 17, 2025, 17:39 [IST]
Other articles published on Jun 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+