Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒరేయ్ రజాక్.. నువ్వు ఐశ్వర్య రాయ్ టాయిలెట్స్ కడగడానికి కూడా పనికిరావురా..!

Fans Slam Abdul Razzaq: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌పై భారత నెటిజన్లు మండిపడుతున్నారు. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ పేరును ప్రస్తావిస్తూ రజాక్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. పాకిస్థాన్ క్రికెటర్లకు సంస్కారం ఉండదనే విషయం మరోసారి రుజువైందని కామెంట్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ దారుణంగా విఫలమవ్వగా.. ఆ దేశ క్రికెట్ బోర్డు, ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. బాబర్ ఆజామ్ చెత్త కెప్టెన్సీతోనే పాకిస్థాన్‌కు ఘోర పరాజయం ఎదురైందని, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తప్పిదం కూడా ఉందని దుమ్మెత్తిపోసారు.

Fans slam Abdul Razzaq for his bizarre comments on Indian actress Aishwarya Rai

పాకిస్థాన్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఆ జట్టు మాజీ ఆటగాళ్లు షాహిద్ అఫ్రిది, మిస్బా ఉల్ హక్, సల్మాన్ బట్ కరాచీలో ఏర్పాటు చేసిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌తో పాటు పీసీబీపై విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా అబ్దుల్ రజాక్.. ఐశ్వర్య రాయ్‌ను ప్రస్తావిస్తూ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు. 'పీసీబీ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. నేను పాక్ జట్టుకు ఆడే సమయంలో యూనిస్ ఖాన్ కెప్టెన్‌గా ఉండేవాడు. అతను జట్టును జట్టును అత్యుత్తమంగా నడిపేవాడు. ఆటగాళ్లకు అండగా ఉంటూ స్పూర్తిని కలిగించేవాడు. అతని మాటలు నన్ను చాలా ప్రభావం చేసేవి. అందుకే జట్టు కోసం నేను సాధ్యమైనంత వరకు చేయగలిగాను.

క్రికెట్‌ను మెరుగుపర్చాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఏమాత్రం లేదు. అలాంటప్పుడు అనుకున్న ఫలితాలు ఎలా వస్తాయి? నేను ఐశ్వర్య రాయ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల అందమైన పిల్లలు పుడతారని అనుకుంటే జరుగుతుందా?. ఇది కూడా అంతే. బోర్డు సంకల్పం బలంగా ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి.'అని రజాక్ ఉదాహారణగా చెప్పాడు.

ఈ వ్యాఖ్యలకు పక్కనున్న వాళ్లంతా చప్పట్లు కొట్టగా.. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. షోయబ్ అక్తర్ వంటి ఆ దేశ ఆటగాళ్లే ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఐశ్వర్య రాయ్ టాయిలెట్స్ కడగడానికి కూడా రజాక్ పనికిరాడంటూ భారత నెటిజన్లు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. ప్రపంచ క్రికెటర్లుగా ఎదిగినా సంస్కారం లేదని మండిపడుతున్నారు.

Story first published: Tuesday, November 14, 2023, 22:12 [IST]
Other articles published on Nov 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+