Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదెక్కడి అవార్డురా.. అయ్యా! మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా అర ఎకరం భూమి!

హైదరాబాద్: క్రికెట్‌ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇస్తుంటారు. సిరీస్‌ మొత్తం మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డు ఇస్తారు. ఈ అవార్డు కింద ఓ ట్రోఫీతో పాటు క్యాష్ రివార్డు కూడా అందజేస్తారు. కొన్ని క్రికెట్‌ బోర్డులు లక్షల రూపాయలను మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఇస్తుంటే మరికొన్ని మాత్రం అత్యంత తక్కువ డబ్బులతో తమ నిస్సహాయతను చాటుకుంటున్నాయి.

భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు 500 అమెరికా డాలర్లను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అందజేసింది. టెస్ట్ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డునే ఇవ్వలేదు. ఇక ఆయా సిరీస్‌లను స్పాన్సర్ చేసే కంపేనీలు తమ ఉత్పత్తులను ఆటగాళ్లకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా అందజేసిన ఘటనలు ఉన్నాయి.

Sherfane Rutherford

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు ఖరీదైన బైక్స్, కార్లను సొంతం చేసుకున్నాడు. అయితే టీ20 కెనడా లీగ్‌లో విచిత్రంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డుగా వెస్టిండీస్ ప్లేయర్ షెర్ఫానే రూథర్‌ఫోర్డ్‌కు అర ఎకరం భూమి ఇచ్చారు. అది కూడా అగ్రరాజ్యం అమెరికాలోని అర ఎకరం భూమిని అవార్డుగా ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ప్రపంచంలో అత్యంత విలువైనది ఏదైనా ఉందా? అంటే అది భూమి మాత్రమే. ఈ భూమి మీదు ఉన్న ప్రతీ వస్తువును మానవుడు తయారు చేసుకోవచ్చు ఏమో కానీ.. భూమిని మాత్రం తయారు చేయలేడు. అందుకే భూమికి ప్రతీ ఏడాది విలువ పెరుగుతూనే ఉంది. ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకున్నారో లేక విచిత్రంగా ఏదైనా చేయాలనుకున్నారో తెలియదు కానీ గ్లోబల్ టీ20 కెనడా లీగ్ నిర్వహాకులు అర ఎకరం భూమిని మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా అందజేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

ప్రస్తుతం ఈ అవార్డుపై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. ఇదెక్కడి అవార్డురా అయ్యా? అంటూ ఫ్యాన్స్ సంభ్రమాశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్యాష్ రివార్డు కన్నా ఇది ఎంతో నయమని అభిప్రాయపడుతున్నారు. క్రికెటర్లకు భూములు అవార్డుగా ఇచ్చుకుంటే పోతే ఈ భూభాగం సరిపోదని మరికొందరు సెటైర్లు పేల్చుతున్నారు. చంద్రమండలంపై కూడా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయాలంటున్నారు.

ఈ అవార్డుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కెనడా టీ20 లీగ్ మూడో సీజన్ విజేతగా మాంట్రియాల్ టైగర్స్ నిలిచింది. సర్రే జాగ్వార్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో మాంట్రియాల్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రసవత్తరంగా సాగిన ఫైనల్లో ఫెర్ఫాన్ రూథర్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.

Story first published: Monday, August 7, 2023, 20:19 [IST]
Other articles published on Aug 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+