Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సాయి బాబా.. పృథ్వీ షా ఆగడం లేదుగా.. మరో సెంచరీ బాదిన డాషింగ్ ఓపెనర్!

లండన్: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా దుమ్మురేపుతున్నాడు. గత గురువారమే డబుల్ సెంచరీ బాదిన పృథ్వీ షా.. తాజాగా మరో సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్‌లోని దేశవాళీ క్రికెట్ ఆడుతున్న పృథ్వీ షా.. డొమెస్టిక్ వన్డే కప్ 2023 టోర్నీలో నార్తాంప్టన్ షైర్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

డర్హమ్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా(76 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. పృథ్వీ షా విధ్వంసకర బ్యాటింగ్‌తో నార్తంప్టన్‌షైర్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన డర్హమ్ 43.2 ఓవర్లలో 198 పరుగులకు కుప్పకూలింది.

Prithvi Shaw

అనంతరం లక్ష్యచేధనకు దిగిన నార్తంప్టన్ షైర్ 25.4 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసి భారీ విజయాన్ని అందుకుంది. 68 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న పృథ్వీ షా సూపర్ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించడం విశేషం. గత బుధవారం సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా 153 బంతుల్లో 244 పరుగులు చేశాడు. పృథ్వీ షా ఇన్నింగ్స్‌లో 28 ఫోర్లు, 11 సిక్స్‌లతో 39 బౌండరీలు ఉండటం విశేషం.

ఈ డబుల్ సెంచరీతో తన ఫేలవ ఫామ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టిన 23 ఏళ్ల పృథ్వీ షా అదే జోరును కొనసాగిస్తున్నాడు. గత కొంత కాలంగా పేలవ ఫామ్, అనవసర గొడవలతో ఫేడ్ ఔట్ అయిన పృథ్వీ షా.. మళ్లీ పూర్వ వైభవం అందుకునేందుకు శ్రమిస్తున్నాడు. భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు కష్టపడుతున్నాడు.

ఇందుకు ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌ను మార్గంగా ఎంచుకున్న పృథ్వీ షా విధ్వంసకర బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. భారత సెలెక్టర్లతో పాటు అభిమానులు అతని గురించి మాట్లాడుకునేలా చేశాడు. పృథ్వీ షా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

పృథ్వీ షా ఇష్టదైవం సాయి బాబాను ఉద్దేశించి ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సాయి బాబా.. పృథ్వీ షా ఆగడం లేదుగా.. భారత జట్టులోకి వస్తే ప్రత్యర్థులకు దబిడి దిబిడే అని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

Story first published: Sunday, August 13, 2023, 21:01 [IST]
Other articles published on Aug 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+