Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హే ప్రభూ... హే హరి రామ్! ఈ వారం బ్యాటర్లకు ఏమైంది?

ఒక్క పరుగు జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 6 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. 9 పరుగులకు ఐదు వికెట్లు చేజార్చుకున్న పాకిస్థాన్! ఈ వారం టెస్ట్ క్రికెట్‌లో నమోదైన అత్యంత చెత్త బ్యాటింగ్ గణంకాలు.! క్రికెట్‌లో అత్యున్నతం అని భావించే టెస్ట్ ఫార్మాట్‌లో బ్యాటర్లు ఇలా తడబడటం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది.

పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌లను రూపొందించడంతోనే బ్యాటర్లు తడబడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు టెస్ట్‌లు అందించే మజానే వేరుగా ఉంటుంది. ఐదు రోజుల ఆట రోజుకో మలుపు తిరుగుతూ అభిమానులను అలరిస్తుంది. సెషన్‌కో ట్విస్ట్‌తో థ్రిల్ చేస్తోంది. అలాంటి టెస్ట్ మ్యాచ్‌లు రెండు-మూడు రోజుల్లోనే ముగుస్తుండటం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది.

Fans Shock after The batting collapses in Test Cricket in this week

అసలే టీ20 ఫార్మాట్ రుచికి మరిగిన అభిమానులు.. టెస్ట్ క్రికెట్‌ను చూడటం మానేసి లైవ్ స్కోర్ అప్‌డేట్స్‌ను ఫాలో అవుతున్నారు. ఇలానే మూడు రోజుల్లో మ్యాచ్‌లు ముగిస్తే... ఈ ఫార్మాట్ చచ్చిపోతుందని మాజీ క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపైనే అనుకుంటే.. సేనా దేశాల్లో(ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతోంది.

ముఖ్యంగా గత వారం రోజుల్లో టెస్ట్‌ల్లో చెత్త బ్యాటింగ్ గణంకాలు నమోదవ్వడం చూసి అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. సౌతాఫ్రికా వర్సెస్ భారత్ మధ్య జరిగిన రెండో టెస్ట్ ఒకటిన్నర రోజుల్లోనే ముగిసింది. అతి తక్కువ ఓవర్లలో (107) ఫలితం తేలిన మ్యాచ్‌గా ఈ మ్యాచ్ చరిత్రకెక్కింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఒక్క పరుగు జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయింది.

147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా ఒక్క పరుగు జోడించకుండా 6 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ అప్రతిష్టను టీమిండియా మూటగట్టుకుంది. ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లోనూ ఇదే సీన్ రీపిట్ అయ్యింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. 289/5తో పటిష్టంగా కనిపించిన ఆ జట్టు 299 పరుగులకు ఆలౌటైంది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ 9 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు 58/2 స్కోర్ నుంచి 62/7 కోల్పోయింది. ఈ గణంకాలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. 'హే ప్రభూ... హే హరి రామ్ ఈ వారం బ్యాటర్లకు ఏమైంది'?అంటూ కామెంట్ చేస్తున్నారు.

Story first published: Friday, January 5, 2024, 19:14 [IST]
Other articles published on Jan 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+