Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రా ధరించిన బాబర్ ఆజామ్.. నెట్టింట పేలుతున్న మీమ్స్!

కొలంబో: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ వరుస షాక్‌లు ఇస్తున్నాడు. ఇటీవలే బోడి గుండుతో దర్శనమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచిన బాబర్ ఆజామ్ తాజాగా బ్రాతో కనిపించాడు. బ్రాలో బాబర్ ఆజామ్‌ను చూసి షాకయిన అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా జోకులు పేల్చుతున్నారు. సాధారణంగా పురుషులు బనీయన్స్ ధరిస్తుంటారు. కానీ బాబర్ ఆజామ్ బ్రా వేసుకోవడం అందరికి నవ్వులు తెప్పించింది.

ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జట్టు 2-0తో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్ట్ విజయానంతరం ఓ చిన్నారి.. బాబార్ ఆజామ్ జెర్సీ కావాలని కోరాడు. దాంతో తాను ధరించిన జెర్సీని అక్కడే విప్పి ఇచ్చిన బాబర్ ఆజామ్.. బ్రాలో ఉన్న తనను చూసుకొని డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి పరుగెత్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

 Babar Azam

అయితే బాబర్ ఆజామ్ ధరించిన స్పోర్ట్ బ్రా.. చాలా మంది వాడుతారని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. అది అమ్మాయిలు వేసుకునే బ్రాలానే ఉన్నా.. ఇది విభిన్నమైనదని చెబుతున్నారు. దీన్ని కంప్రెషన్ వెస్ట్ అని పిలుస్తారని, భుజాల మధ్య వెనుక భాగాన్ని ఫిట్‌గా ఉంచేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు వివరించారు.

ఇది చాలా తేలికగా ఉంటుందని, వేసుకున్నట్లు కూడా అనిపించదని, ఇందులో ప్రత్యేకంగా అమర్చిన జీపీఎస్ ట్రాకర్ ఉంటుందని చెబుతున్నారు. ఇది ప్లేయర్ రన్నింగ్ స్పీడ్‌తో పాటు ఆటగాళ్ల కదలికలను త్రీడీలో కొలుస్తూ.. వారి స్థానాలను ట్రాక్ చేస్తుందంట. అంతేకాకుండా వారి హార్ట్ రేట్‌ను కూడా మానిటర్ చేస్తుందంట.

ఇది ఇచ్చే డేటాబేస్‌ను అనలిస్ట్‌లు పరిశీలించి ప్లేయర్ ఫిటెనెస్‌ను అంచనా వేస్తారంట. భారత ఆటగాళ్లు కూడా ఈ తరహా బ్రాలను వాడరని, 2018లో అప్పటి కండిషనింగ్ కోచ్ శంకర్ బసు టీమిండియా ఆటగాళ్లకు ఇచ్చాడని జాతీయ మీడియా పేర్కొంది. ఏది ఏమైనా బాబర్ ఆజామ్ అమ్మాయిల బ్రా ధరించాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్స్ టేబుల్‌లో పాకిస్థాన్ అగ్రస్థానానికి చేరింది. ఆసియాకప్ 2023 టోర్నీ వరకు పాకిస్థాన్ జట్టుకు విశ్రాంతి లభించనుంది.

Story first published: Saturday, July 29, 2023, 18:34 [IST]
Other articles published on Jul 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+