శుభ్‌మన్ గిల్ సెంచరీ.. 9 సిక్సర్లతో వీరవిహారం..కేఎల్ రాహుల్‌కు సరైన మొగుడు అంటున్న ఫ్యాన్స్!

కోల్‌కతా: ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శుభ్‌మన్‌గిల్(55 బంతుల్లో 11 ఫోర్లు, 9 సిక్స్‌తో 126) సెంచరీతో చెలరేగాడు. 9 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. టీమిండియాకు ఎంపికైన సంతోషమో... లేక అచ్చొచ్చిన ఈడెన్ గార్డెన్స్ మైదానమనో తెలియదు కానీ శుభ్‌మన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న శుభ్‌మన్.. కర్ణాటకతో మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్.. మరో 19 బంతుల వ్యవధిలోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.
సెమీస్‌కు పంజాబ్..
శుభ్‌మన్ విధ్వంసంతో పంజాబ్ ఈ మ్యాచ్‌లో 9 పరుగులతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 225 పరుగులు చేసింది. అనంతరం కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది. అభినవ్ మనోహర్(62 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది.
ఈ విజయంతో పంజాబ్ సెమీస్ చేరగా.. కర్ణాటక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక శుభ్‌మన్ ఇన్నింగ్స్‌పై ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టీమిండియా భవిష్యత్తు ఓపెనర్ అతనేనంటూ కామెంట్ చేస్తున్నారు.

రాహుల్ కంటే శుభ్‌మన్ నయం..
టీ20 ప్రపంచకప్ 2022కి కేఎల్ రాహుల్‌కు బదులు శుభ్‌మన్ గిల్‌ను పంపించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. రాహుల్ ఇలానే విఫలమైతే శుభ్‌మన్ అతని స్థానాన్ని భర్తీ చేయడం ఖాయమంటున్నారు. రాహుల్‌కు అసలైన మొగుడు శుభ్‌మన్ గిల్ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. శుభ్‌మన్ జోరు చూసైనా రాహుల్ జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. అతి త్వరలోనే రాహుల్ స్థాన్నాన్ని శుభ్‌మన్ భర్తీ చేస్తాడని జోస్యం చెబుతున్నారు.
టీమిండియాకు ఆడటం..
ఏ ఫార్మాట్‌లోనైనా టీమిండియాకు ఆడటం గొప్ప మోటివేషన్ అని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. కర్ణాటకపై సెంచరీ అనంతరం వన్ ఇండియా బంగ్లా చానెల్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన శుభ్‌మన్.. ఈడెన్ గార్డెన్స్‌లో తనకున్న అనుభవమే ఈ అసాధారణ ఇన్నింగ్స్ ఆడేలా చేసిందన్నాడు. 'గతంలో ఈడెన్ గార్డెన్స్‌లో ఎన్నో మ్యాచ్‌లు ఆడాను.
ఇన్నింగ్స్ నిర్మించడంపై అవగాహన ఉంది. క్రీజులో సెట్ అవ్వడానికి కాస్త టైమ్ తీసుకుంటే తర్వాత చెలరేగవచ్చు. అదే ప్రణాళికతో ఆడి సెంచరీ బాదా. ఇది నాకు ప్రత్యేకమైన ఇన్నింగ్స్. న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికవ్వడం సంతోషంగా ఉంది. భారత జట్టు తరఫున ఆడటం ఎప్పటికీ గొప్ప మోటివేషన్. ఆ సిరీస్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా'అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications