IND vs WI: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. ట్రెండింగ్‌లో సారా టెండూల్కర్!

న్యూఢిల్లీ: రెండేళ్ల తర్వాత వన్డే క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64) తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో బరిలోకి దిగిన శుభ్‌మన్‌గిల్ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. కెప్టెన్ శిఖర్ ధావన్‌తో కలిసి తొలి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. తొలి బంతి నుంచే ధాటిగా ఆడిన గిల్.. స్కోర్ బోర్డు పరుగెత్తించాడు. అదే ఊపులో సెంచరీ చేస్తాడని అంతా భావించగా.. నిర్లక్ష్యంగా పరుగెత్తి రనౌట్‌గా వెనుదిరిగాడు.
ట్రెండింగ్‌లో సారా..
గిల్ సూపర్ ఇన్నింగ్స్‌తో భారత్ భారీ స్కోర్ చేసి 4 పరుగులతో విజయాన్నందుకుంది. దాంతో గిల్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గిల్ ఒక్కడినే కాదు.. అతని గర్ల్‌ఫ్రెండ్‌గా ప్రచారం జరుగుతున్న సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్‌ను నెటిజన్లు కొనియాడుతున్నారు. గిల్ రాణించిన ప్రతీసారి సారా టెండూల్కర్ పేరు ట్రెండింగ్ నిలవడం ఇదే తొలిసారి కాదు.
గతంలోనూ అనేక సార్లు గిల్ సూపర్ ఇన్నింగ్స్ క్రెడిట్ సారా టెండూల్కర్‌కు ఇచ్చారు. గిల్‌ను కొనియాడుతూ సారా టెండూల్కర్‌ను ట్యాగ్ చేస్తున్నారు. కొందరైతే.. గిల్ ఇన్నింగ్స్‌తో సారా ఆనందపడి ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.
పీకల్లోతు ప్రేమలో సారా-గిల్
ఈ సమయంలో సారా అంత హ్యాపీ పర్సన్ ఇంకొకరు ఉండరంటూ... సారా గిల్ ని చూసి గర్వపడుతుందంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక సారా, గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరికొకరు ఫాలో అవ్వడం.. ఫొటోలకు కామెంట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరుంది. అయితే తమ ప్రేమ వ్యవహారంపై అటూ సారా టెండూల్కర్ కానీ ఇటు గిల్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ రూమర్లను కొట్టిపారేయలేదు. చివరకు సచిన్ కూడా మౌనంగానే ఉంటున్నాడు.
సచిన్ రికార్డు బ్రేక్..
ఇక ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించిన గిల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ గడ్డపై వన్డే ఫార్మాట్‌లో అర్ధ సెంచరీ సాధించిన రెండో భారత అతి పిన్న వయస్కుడుగా గిల్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో సచిన్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. సచిన్ ఈ ఫీట్‌ను 24 ఏళ్ల 3 రోజుల వయస్సులో నమోదు చేయగా.. గిల్ 22 ఏళ్ల 317 రోజుల వయస్సులో సాధించాడు. ఇక ఈ ఘనతను భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కేవలం 22 ఏళ్ల 215 రోజుల వయస్సులో సాధించి తొలి స్థానంలో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications