సెంచరీతో మామ రికార్డు బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్.. సంతోషంలో సారా టెండూల్కర్! నెట్టింట పేలుతున్న మీమ్స్!

హరారే: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(97 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 130) ఎట్టకేలకు సెంచరీ సాధించాడు. జింబాబ్వేతో మూడో వన్డేలో ఫస్ట్ డౌన్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన గిల్.. అంతర్జాతీయ వన్డేల్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో 98 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తృటిలో శతకాన్ని చేజార్చుకున్న గిల్.. జింబాబ్వే పర్యటనలో ఆ కోరికను నేరవేర్చుకున్నాడు. 82 బంతుల్లో గిల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. తద్వారా పలు రికార్డులను తన పేరిట లిఖించుకోవడమే కాకుండా భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.
మామ రికార్డు బ్రేక్..
ఈ మ్యాచ్‌లో మొత్తం 130 పరుగులు చేసిన గిల్.. హరారేలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. 2001లో హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో సచిన్ 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. విదేశీ గడ్డపై సెంచరీ చేసిన మూడో పిన్న వయస్కుడిగా శుభ్‌మన్ నిలిచాడు. ఈ జాబితాలో గిల్(22 ఏళ్ల 348 రోజులు) కంటే యువ రాజ్(22 ఏళ్ల 41 రోజులు), విరాట్ కోహ్లీ(22 ఏళ్ల 315 రోజులు) ముందు స్థానంలో ఉన్నారు.
ట్రెండింగ్‌లో సారా..
గిల్ సూపర్ సెంచరీతో భారత్ 290 పరుగుల భారీ లక్ష్యాన్ని జింబాబ్వే ముందు ఉంచింది. దాంతో గిల్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గిల్ ఒక్కడినే కాదు.. అతని గర్ల్‌ఫ్రెండ్‌గా ప్రచారం జరుగుతున్న సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్‌ను నెటిజన్లు కొనియాడుతున్నారు. గిల్ రాణించిన ప్రతీసారి సారా టెండూల్కర్ పేరు ట్రెండింగ్ నిలవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేక సార్లు గిల్ సూపర్ ఇన్నింగ్స్ క్రెడిట్ సారా టెండూల్కర్‌కు ఇచ్చారు. గిల్‌ను కొనియాడుతూ సారా టెండూల్కర్‌ను ట్యాగ్ చేస్తున్నారు. కొందరైతే.. గిల్ ఇన్నింగ్స్‌తో సారా ఆనందపడి ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్, వీడియోలు షేర్ చేస్తున్నారు.
పీకల్లోతు ప్రేమలో సారా-గిల్
ఈ సమయంలో సారా అంత హ్యాపీ పర్సన్ ఇంకొకరు ఉండరంటూ... సారా గిల్ ని చూసి గర్వపడుతుందంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక సారా, గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరికొకరు ఫాలో అవ్వడం.. ఫొటోలకు కామెంట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరుంది. అయితే తమ ప్రేమ వ్యవహారంపై అటూ సారా టెండూల్కర్ కానీ ఇటు గిల్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ రూమర్లను కొట్టిపారేయలేదు. చివరకు సచిన్ కూడా మౌనంగానే ఉంటున్నాడు.
భారత్ 289/8
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు చేసింది. శుభ్‌మన్ సెంచరీకి తోడుగా ఇషాన్ కిషన్(61 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని అందిచారు. అంతకుముందు ఓపెనర్లు రాహుల్(30), శిఖర్ ధావన్(40) పర్వాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్(5/54) ఐదు వికెట్లతో చెలరేగగా.. విక్టర్, లూక్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications