తదుపరి అధ్యక్షుడిగా..
1983 ప్రపంచకప్ విన్నర్ రోజర్ బిన్నీ బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ దాఖలు చేయగా.. ఉపాధ్యక్ష పదవికి రాజీవ్ శుక్లా పోటీపడుతున్నాడు. అధ్యక్ష పదవికి బిన్నీ నామినేషన్ దాఖలు చేశాడని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపాడు. ఇక బీసీసీఐ రాజకీయాలకు దాదా బలయ్యాడనే ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు విరాట్ కోహ్లీ అభిమానులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందేనని కోహ్లీ ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. గతేడాది టీ20 ప్రపంచకప్‌కు ముందు తాను పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని మిగిలినా ఫార్మాట్లలో సారథిగా కొనసాగుతానని కోహ్లీ భావించాడు. ఆ మేరకు టీ20 బాధ్యతలకు గుడ్ బై చెప్పాడు.
కెప్టెన్సీ నుంచి తప్పించి..
అయితే కోహ్లీని తాము వారించామని.. స్ప్లిట్ కెప్టెన్సీ భారత్ కు సెట్ కాదని చెప్పినా వినకుండా అతను టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడని గంగూలీ వ్యాఖ్యానించడం పెద్ద వివాదానికి దారి తీసింది. గంగూలీ చేసిన వ్యాఖ్యలపై కోహ్లీ ఈ ఏడాది ప్రారంభంలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లేముందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'బీసీసీఐ నుంచి నన్నెవరూ సంప్రదించలేదు. అది నా సొంత నిర్ణయం' అని చెప్పి దాదా వ్యాఖ్యలకు కౌంటరిచ్చాడు. ఇది జరగడానికంటే కొద్దిరోజుల ముందే బీసీసీఐ.. కోహ్లీని వన్డే సారథిగా తప్పించి టెస్టులకు మాత్రమే పరిమితం చేసింది.
అప్పడు విర్రవీగి...
ఇక సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ తర్వాత కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. దీని వెనుకా బీసీసీఐ హస్తముందని అతని అభిమానులు వాపోయారు. కోహ్లీ వందో టెస్టు సందర్భంగా కూడా అతడిని సరిగ్గా గౌరవించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది. కోహ్లీ-గంగూలీల వివాదంతో పాటు రోహిత్ వర్సెస్ కోహ్లీ చర్చ కూడా సాగింది. అయితే కొద్దికాలానికి రోహిత్ - కోహ్లీ వివాదం ముగిసినా గంగూలీపై విరాట్ వీరాభిమానులు రాళ్లు విసురుతూనే ఉన్నారు. ఇక తాజాగా గంగూలీ.. బీసీసీఐ బాస్ గా తప్పుకుంటుండటంతో కర్మ ఫలితాన్ని పొందుతున్నాడని అతడి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications












