For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హార్దిక్ ప్యాండ్యా మాస్టర్ స్లాన్.. ఆ రూల్‌తో రోహిత్ శర్మకు చెక్!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా‌పై రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే రోహిత్ శర్మ‌ను హార్దిక్ పాండ్యా ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మైదానంలో రోహిత్ శర్మ లేకుండా చూసుకునేందుకే హార్దిక్ పాండ్యా తెలివిగా అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు హార్దిక్ ఫ్యాన్స్, రోహిత్ శర్మ హేటర్స్ మాత్రం అతనిది మాస్టర్ ప్లాన్ అంటూ కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్‌గా మారింది. గతేడాది రోహిత్ శర్మను కాదని ముంబై ఇండియన్స్.. హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని రోహిత్ శర్మతో పాటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్, ఆ జట్టు సీనియర్ ఆటగాళ్లు వ్యతిరేకించారు.

Fans says Hardik Pandya sidelined Rohit Sharma with impact player rule in IPL 2025

మ్యాచ్‌ల సందర్భంగా హార్దిక్ పాండ్యాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎగతాళి చేశారు. మైదానంలో హార్దిక్‌కు సీనియర్ ఆటగాళ్ల నుంచి మద్దతు కూడా లేనట్లు కనిపించింది. దాంతో ఆ సీజన్‌లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమై.. పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. తాజా సీజన్‌లో మాత్రం ఈ పరిస్థితి లేదు. టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపుతో హార్దిక్ పాండ్యాకు ముంబై ఫ్యాన్స్‌ అండగా నిలుస్తున్నారు.

అయితే ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్‌లో ఆశించిన శుభారంభం దక్కలేదు. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌తో పాటు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. నిషేధం కారణంగా హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్‌కు దూరం కాగా.. రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. సొంతగడ్డపై కేకేఆర్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అసాధారణ ప్రదర్శనతో సంచలన విజయాన్నందుకుంది. అయితే ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండో మ్యాచ్ మినహా రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు.

మైదానంలో రోహిత్ శర్మ నుంచి ఇబ్బంది ఉండొద్దనే హార్దిక్ పాండ్యా.. అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిస్తున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏ జట్టు కూడా రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించదని, హార్దిక్ ఉద్దేశపూర్వకంగా ఆడిస్తున్నాడని మరికొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మైదానంలో కెప్టెన్‌గా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలనే హార్దిక్ ఇలా చేస్తున్నాడని ఇంకొందరు అండగా నిలుస్తున్నారు. రోహిత్ శర్మ ఈ మూడు మ్యాచ్‌ల్లో 0, 8, 12 దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతనికి తుది జట్టులో చోటే దండుగని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Tuesday, April 1, 2025, 15:29 [IST]
Other articles published on Apr 1, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+