Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kashvee Gautam: ఇషాన్ కిషన్ చెల్లికి హార్దిక్ పాండ్యా గిఫ్ట్!

గుజరాత్ జెయింట్స్ ఆల్‌రౌండర్ కాశ్వీ గౌతమ్.. తన ఆరాధ్య క్రికెటర్ హార్దిక్ పాండ్యాను కలిసింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఓటమిపాలైంది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరగా.. గుజరాత్ జెయింట్స్ ఇంటిదారి పట్టింది. ఈ కీలక మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్‌కు మద్దతుగా హార్దిక్ పాండ్యాతో పాటు బ్యాటింగ్ కోచ్ కీరన్ పోలార్డ్ ఇతర ప్లేయర్లు హాజరయ్యారు.

మ్యాచ్ ముగిసిన అనంతరం కాశ్వీ గౌతమ్‌.. హార్దిక్ పాండ్యాను కలిసింది. ఈ సందర్భంగా ఆమెను హర్లీన్ డియోల్.. హార్దిక్‌కు పరిచయం చేసింది. 'హాయ్ సర్.. మీకు నేను పెద్ద అభిమానిని.'అని కాశ్వీ గౌతమ్ అనగా.. 'థ్యాంక్యూ.. ఈ సీజన్ ఎలా సాగింది?'అని హార్దిక్ బదులిచ్చాడు. అందుకు ఆమె చాలా బాగా సాగిందని చెప్పింది. వెంటనే హర్లీన్ డియోల్.. కాశ్వీ మీకు పెద్ద అభిమాని, మిమ్మల్ని తరుచూ ఇమిటేట్ చేస్తోందని తెలిపింది. వెంటనే హార్దిక్.. మీరు కూడా ఆల్ రౌండరా? బ్యాటింగ్ కూడా చేస్తారా? అని అడిగాడు. వెంటనే కాశ్వీ'అవును.. నేను బ్యాటింగ్ కూడా చేస్తాను. నా బ్యాట్‌పై HP33 అని రాసి ఉంది.'అని చెప్పింది. హార్దిక్ బ్యాట్ గురించి ప్రశ్నించి.. మంచి బ్యాట్‌ను బహుమతిగా పంపిస్తానని చెప్పాడు. దాంతో కాశ్వీ గౌతమ్ సంతోషం వ్యక్తం చేసింది.

Fans Says Hardik Pandya promises to gift Ishan kishan sister Kashvee Gautam special bat
Photo Credit: Gujarat Giants Instagram

గత సీజన్‌లో రూ. 2 కోట్లకు కాశ్వీ గౌతమ్‌ను గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అయితే గాయంతో ఆ సీజన్ ఆడలేకపోయింది. తాజా సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడి 6.45 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టింది. బ్యాట్‌తోనే విలువైన పరుగులు చేసింది. కాశ్వీ గౌతమ్‌ను నెటిజన్లు ఇషాన్ కిషన్ చెల్లెలుగా పిలుస్తారు. చూడటానికి ఈ ఇద్దరూ ఒకేలా ఉండటంతో ఆమెకు నెటిజన్లు ఇషాన్ కిషన్ సిస్టర్ అనే పేరు పెట్టారు. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ చెల్లికి హార్దిక్ పాండ్యా గిఫ్ట్ ఇస్తానని ప్రామిస్ చేశాడని కామెంట్ చేస్తున్నారు. అయితే కాశ్వీ గౌతమ్‌కు ఇషాన్ కిషన్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇషాన్ కిషన్ జార్ఖండ్‌కు చెందిన ఆటగాడు అయితే.. కాశ్వీ గౌతమ్.. ఛండీఘడ్ ప్లేయర్.

Story first published: Saturday, March 15, 2025, 14:56 [IST]
Other articles published on Mar 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+