For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంభీర్.. ధోనీ పేరు చెప్పేందుకు సిగ్గుండాలి!

టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లకు ధోనీ గురించి మాట్లాడే అర్హత లేదని అభిమానులు అంటున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోర పరాజయానికి గంభీర్, రోహిత్ వ్యూహాత్మక తప్పిదాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టు విజయానికి కావాల్సిన వ్యూహాలు రచించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా అని గుర్తు చేసుకుంటున్నారు.

ఇక గౌతమ్ గంభీర్‌కు ధోనీపై చాలా కోపం ఉంది. చాలా సందర్బాల్లో అతను ఈ విషయాన్ని బయటపెట్టాడు. టీ20 ప్రపంచకప్ 2007, వన్డే ప్రపంచకప్ 2011 విజయాల్లో తనకు దక్కాల్సిన క్రెడిట్ ధోనీకి దక్కిందనే కోపం గంభీర్‌కు ఉంది. అంతేకాకుండా తుది జట్టులో అవకాశాలు ఇవ్వకుండా టీమిండియాకు దూరం చేశాడని మనసులో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అవకాశం దొరికినప్పుడల్లా ధోనీపై విమర్శలు గుప్పించాడు. మరోవైపు రోహిత్ శర్మకు మాత్రం ధోనీనే అవకాశం ఇచ్చాడు.

Fans says Gautam Gambhir should not talk about MS Dhoni again Over BGT loss

మిడిలార్డర్‌లో ఆడే రోహిత్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చాడు. దాంతో అతను స్టార్ క్రికెటర్‌గా.. కెప్టెన్‌గా ఎదిగాడు. అయితే ఈ ఇద్దరికి ధోనీ స్థాయి ప్లానింగ్ వ్యూహం లేదని మహీ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు ఓ సందర్భాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు.

2008లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. అయితే ఈ టోర్నీ భారత్ గెలవడం వెనుక ధోనీ మైండ్‌ గేమ్ ఉంది. ఆ సమయంలో టీమిండియా కెప్టెన్‌గా ధోనీ ఉన్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగో మ్యాచ్‌లో టీమిండియా విజయం ముంగిట నిలవగా.. క్రీజులో ఉన్న ధోనీ డ్రెస్సింగ్ రూమ్‌కు ఓ సందేశాన్ని పంపించాడు. ఈ విజయాన్ని ఎవరూ సెలెబ్రేట్ చేసుకోవద్దని, అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పాడు.

ఆ సమయంలో రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు నెంబర్ వన్ జట్టుగా కొనసాగుతోంది. ఆ సమయంలో ఆసీస్‌కు పరాజయం ఎదురైతే ప్రత్యర్థి లక్కీగా గెలిచిందనే భావన ఆ జట్టుకు ఉండేది. తదుపరి మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించి విజయం సాధించేవారు. ఈ విషయాన్ని గ్రహించిన ధోనీ.. ఎలాంటి సంబరాలు చేసుకోకుండా జట్టును ప్రశాంతంగా ఉంచాడు. ఆసీస్‌ను కవ్వించలేదు. దాంతో తదుపరి మ్యాచ్‌లోనూ ఆసీస్‌పై విజయం సాధించి జట్టును విజేతగా నిలబెట్టాడు.

అయితే తాజా ఆసీస్ పర్యటనలో రోహిత్, గంభీర్, కోహ్లీలు ఫాలో ఆన్ తప్పించుకుంటే మ్యాచ్ గెలిచిందనే రీతిలో సంబరాలు చేసుకున్నారు. టెయిలెండర్ల సాయంతో ఫాలో అన్ తప్పించుకున్న భారత్ సంబరాలు చేసుకోవడం ద్వారా తమ జట్టు ఎంత బలహీనంగా ఉందనే విషయాన్ని ప్రత్యర్థికి తెలియజేశారు. తమ చర్యతో ఆసీస్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత రెట్టింపు చేశారు.

అయితే ఆసీస్ బలపడుతుందని రోహిత్, గంభీర్ అంచనా వేయలేకపోయారు. చివరకు సిరీస్‌ను 1-3తో కోల్పోయి మూల్యం చెల్లించుకున్నారు. ఈ క్రమంలోనే వ్యూహాలు, ఆలోచన విధానంలో ధోనీకి ఎవరూ సరితూగలేరని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ధోనీ పేరు పలకడానికి కూడా రోహిత్, గంభీర్ అనర్హులని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Tuesday, January 7, 2025, 16:58 [IST]
Other articles published on Jan 7, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+