Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేన్ మామ.. నీ కన్నా ఆ పుజారా నయం! వార్నర్‌ను కాదని నిన్ను నమ్ముకున్నందుకు నట్టేట ముంచేసావ్! ఫ్యాన్స్ ఫైర్

Fans roast Kane Williamson and SRH for 5th loss on the trot in IPL 2022

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌పై సొంత జట్టు అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో పేలవ బ్యాటింగ్‌తో జట్టు వరుస ఓటములకు కారణమవుతున్న కేన్ మామను సోషల్ మీడియా వేదికగా కడిగిపారేస్తున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ 55 పరుగులతో చిత్తయింది.

ఈ ఓటమితో ఆరెంజర్ ఆర్మీ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అంతేకాకుండా సన్‌రైజర్స్‌కు వరుసగా ఇది ఐదో పరాజయం. దాంతో అభిమానులు తమ ఆగ్రహాన్ని ఆపుకోలేకపోతున్నారు. ఫన్నీ మీమ్స్, సెటైర్లతో కేన్ మామను ట్రోల్ చేస్తున్నారు.

ఆ పుజారా నయం..

కౌంటీ క్రికెట్‌లో డబుల్ సెంచరీలతో రాణిస్తున్న చతేశ్వర్ పుజారాను తీసుకున్నా సన్‌రైజర్స్‌కు ఈ గతిపట్టేది కాదని సెటైర్లు పేల్చుతున్నారు. రిటెన్షన్ ప్రక్రియతో కేన్ మామకు చెల్లించిన రూ.14 కోట్లు దండుగని, అతన్ని మళ్లీ రిటైన్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. వచ్చే ఏడాది వేలంలోకి వచ్చినా అతను అన్‌సోల్డ్ లిస్ట్‌లో చేరుతాడని మండిపడుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన కేన్.. 208 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ మరి దారుణంగా 92 మాత్రమే ఉంది.

లారా సైతం అసంతృప్తి..

కేకేఆర్‌తో కీలక మ్యాచ్‌లోనూ కేన్.. 17 బంతుల్లో 9 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని వైఫల్యంపై జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక కేన్ ఆటతీరుపై అభిమానులే కాదు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేన్ ఔటైన వెంటనే డగౌట్‌లో ఉన్న లారా సైతం నెత్తికి తల పెట్టుకొని బాధపడ్డాడు. బ్యాటింగ్ వైఫల్యమే అనుకుంటే.. కెప్టెన్సీ కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. కేకేఆర్‌తో చివరి ఓవర్‌ను వాషింగ్టన్ సుందర్‌తో వేయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాదిన రస్సెల్.. మ్యాచ్ మూమెంటమ్‌ను మార్చేసాడు.

డేవిడ్ వార్నర్‌ను కాదని..

జట్టుకు టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్‌ను కాదని కేన్ విలియమ్సన్‌పై నమ్మకం ఉంచితే అతను నట్టేట ముంచేసాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వార్నర్ బ్రోను ఉంచుకున్నా ఈ పరిస్థితి వచ్చేది కాదని కామెంట్ చేస్తున్నారు. అసలు కేన్ విలియమ్సన్‌ను ఓపెనర్‌గా ఆడించడమే సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ చేస్తున్న అతిపెద్ద తప్పిదమని మండిపడుతున్నారు. రాహుల్ త్రిపాఠిని ఓపెనర్‌గా పంపించి, కేన్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని సూచిస్తున్నారు.

అభిషేక్ ఒక్కడే..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఆండ్రీ రస్సెల్(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49 నాటౌట్), సామ్ బిల్లింగ్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించగా... అజింక్యా రహానే(24 బంతుల్లో 3 సిక్స్‌లతో 28),నితీశ్ రాణా(16 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 26) ధాటిగా ఆడారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లతో చెలరేగగా.. భువీ, జాన్సెన్, నట్టూ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్‌లతో 43), ఎయిడెన్ మార్క్‌రమ్(25 బంతుల్లో 3 సిక్స్‌లతో 32) మినహా అంతా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ మూడు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, May 15, 2022, 10:41 [IST]
Other articles published on May 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+