భారత్‌తో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్.. అతి తక్కువ కాలంలోనే స్టార్ క్రికెటర్లకు దక్కే క్రేజీని సొంతం చేసుకున్నాడు.
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను చితక్కొట్టడం.. వరల్డ్ బెస్ట్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీతో గొడవపడటం.. బుమ్రాతో వాగ్వాదానికి దిగడం వంటి ఘటనలతో సామ్ కొన్‌స్టాస్ తరుచూ వార్తల్లో నిలిచాడు. సిరీస్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీకి తాను పెద్ద అభిమానినని తెలిపి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

కెరీర్‌లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేసిన సామ్ కొన్‌స్టాస్ కోసం ఓ అభిమాని చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సామ్ కొన్‌స్టాస్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన సదరు వ్యక్తి.. చిన్న పొరపాటుతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు.
అసలేం జరిగిందంటే..?
ప్రాక్టీస్ కోసం తన క్రికెట్ కిట్ పట్టుకొని సామ్ కొన్‌స్టాస్ వెళ్తున్నాడు. అతని వెనుకాలే కారులో వచ్చిన వ్యక్తి.. సామ్ కొన్‌స్టాస్‌ను గమనించి అతనితో సెల్ఫీ దిగాలని భావించాడు. వెంటనే కారును పార్క్ చేసి సామ్ కొన్‌స్టాస్ కోసం పరుగెత్తాడు. అయితే ఈ హడావుడిలో కారు హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచిపోయాడు. అయితే అక్కడ డౌన్ ఉండటంతో కారు ముందుకు కదిలింది. సామ్ కొన్‌స్టాస్ కోసం పరుగెత్తిన వ్యక్తి.. కారు కదలడం చూసి అలర్ట్ అయ్యాడు. తిరిగి కారు వద్దకు వచ్చే లోపే అది ముందటి కారును ఢీకొట్టింది.
అయితే ఈ ఘటనలో ఎవరికి ఏం కాలేదు. కానీ కార్లు ఢీకొట్టడం వల్ల రెండు కార్లకు ముందు డ్యామేజ్ అయ్యింది. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. సదరు అభిమాని సామ్ కొన్‌స్టాస్‌ను కలిసాడా? లేదా? అనే విషయంపై కూడా ఎలాంటి సమాచారం లేదు. ఇందుకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీ మాత్రం వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన అభిమానులు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. 'సామ్‌కొన్‌స్టాస్‌తో సెల్ఫీ.. చాలా కాస్ట్‌లీ గురూ'అని సెటైర్లు పేల్చుతున్నారు.