IPL 2022: అంపైర్లకు కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి.. బీసీసీఐకి ఫ్యాన్స్ అడ్వైజ్! కోహ్లీ ఔట్‌పై ఫైర్!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో అంపైర్ల తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ బెస్ట్ లీగ్‌లో ఈ నాసిరకం అంపైరింగ్ ఏందని ప్రశ్నిస్తున్నారు. లీగ్ ప్రారంభమైన 15 రోజుల్లోనే అంపైర్లు ఘోర తప్పిదాలు చేశారని, ఇలా అయితే ఎలా? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అంపైర్లకు నిబంధనలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి సూచిస్తున్నారు. ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో అంపైర్ల తప్పుడు నిర్ణయానికి విరాట్ కోహ్లీ బలయ్యాడు. హాఫ్ సెంచరీ ముంగిట టీవీ అంపైర్ అవగాహన రాహిత్యంతో వెనుదిరగడంతో కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు.
అసలేం జరిగిందంటే..?
ఐపీఎల్‌లో బేబీ ఏబీ(డెవాల్డ్ బ్రేవిస్) వేసిన తొలి ఓవర్ తొలి బంతికే విరాట్ కోహ్లీ ఎల్బీగా వెనుదిరిగాడు. బేబీ ఏబీ వేసిన 19 ఓవర్ తొలి బంతి వికెట్ల మీదకు దూసుకు రాగా.. విరాట్ కోహ్లీ డిఫెండ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్, ప్యాడ్‌ను ఒకేసారి తాకింది. దాంతో ముంబై ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. బంతి బ్యాట్‌కు తాకిందనే కాన్ఫిడెన్స్‌తో విరాట్ కోహ్లీ వెంటనే రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో పలు కోణాల్లో థర్డ్ అంపైర్ పరిశీలించి.. బ్యాట్, ప్యాడ్‌ను బంతి ఒకేసారి తాకినట్లు స్పష్టం చేశాడు. అయితే ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు కాబట్టి తాను బాల్ ట్రాకింగ్‌ను చెక్ చేస్తున్నానని థర్డ్ అంపైర్ తెలిపాడు. బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను హిట్ చేయడంతో ఔట్‌గా ప్రకటించాడు.

నిబంధనలు ఏంటంటే..?
ఎంసీసీ నిబంధనల ప్రకారం థర్డ్ అంపైర్ చేసింది తప్పు. ఎల్బీ విషయంలో బంతి ఒకేసారి బ్యాట్, ప్యాడ్‌ను తాకినప్పుడు బ్యాట్‌కు తాకినట్లే పరిగణించాలి. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడని ప్యాడ్‌కు తాకినట్లు పరిగణించి తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ నిర్ణయంపై విరాట్ కోహ్లీ మైదానంలోనే అసంతృప్తి వ్యక్తం చేయగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సోషల్ మీడియా వేదికగా అసలు నిబంధన ఏం చెబుతుందో తెలియజేసి అసంతృప్తిని వెల్లగక్కింది.

స్పెషల్ క్లాస్‌లు..
అభిమానులు సైతం అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌సీబీ మ్యాచ్ గెలిచింది కాబట్టి ఈ తప్పిదం పెద్దగా కనిపించడం లేదని, ఓడిపోతే పరిస్థితి వేరేలా ఉండేదని కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా విరాట్ కోహ్లీ ఇలాంటి తప్పుడు నిర్ణయాలకు బలయ్యాడని గుర్తు చేస్తున్నారు. వివాదాస్పద ఎల్బీ నిర్ణయాలకు విరాట్ బలవుతున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంపైర్లకు నిబంధనలపై స్పెషల్ క్లాస్‌లు నిర్వహించాలని సెటైర్లు పేల్చుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications