దండం..రా అయ్యా! ఇంకెన్ని ఘోరాలు చూడాలో?
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం ఆడిన తొలి మ్యాచ్‌లో టీమిండియా గట్టి షాక్ తగిలింది. పసికూన ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌పై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం.
ఈ మ్యాచ్‌కు భారత్‌తో 8 టీ20లు, 3 వన్డేలు ఆడిన ఐర్లాండ్.. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. కానీ తాజా విజయంతో సరికొత్త చరిత్రను లిఖించింది. మరోవైపు టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయాల తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌ల్లో ఓడిన జట్టుగా అప్రతిష్ట మూటగట్టుకుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 విజయం తర్వాత జింబాబ్వే చేతిలో టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే.
గంభీర్‌పై విమర్శలు..
ఈ ఘోర పరాజయాల నేపథ్యంలో గంభీర్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గంభీర్ పర్యవేక్షణలో తాము ఇంకెన్ని ఘోరాలు చూడాలోనని కామెంట్ చేస్తున్నారు. గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా రెండు ఐసీసీ టైటిళ్లు గెలిచింది. కానీ భారత క్రికెట్ చరిత్రలోనే చూడని ఘోర పరాజయాలను మూటగట్టుకుంది.

గంభీర్ పర్యవేక్షణలో ఘోర పరాజయాలు..
గంభీర్ కోచ్ బాధ్యతల చేపట్టిన తర్వాత మొదటి వన్డే సిరీస్‌నే టీమిండియా కోల్పోయింది. దాంతో 27 ఏళ్ల తర్వాత శ్రీలంక గడ్డపై సిరీస్ కోల్పోయిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్ క్లీన్ స్వీప్ అయ్యింది. భారత క్రికెట్ టెస్ట్ చరిత్రలోనే సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం టీమిండియాకు ఇదే తొలిసారి. 19 ఏళ్ల తర్వాత చిన్నస్వామి స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ ఓడింది.
10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. 17 ఏళ్ల తర్వాత అడిలైడ్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో ఓడింది. 25 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. 15 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ మ్యాచ్ ఓడింది. భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో సిరీస్ కోల్పోయింది. తాజాగా అంతర్జాతీయ టీ20ల్లో పసికూన ఐర్లాండ్ చేతిలో తొలి ఓటమిని చవిచూసింది.గంభీర్ పదవి కాలం ముగిసేలోపు ఇలాంటి ఘోరాలు ఇంకెన్ని చూడాలోనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

