న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిప్పు-ఉప్పుగా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అఫ్గాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్ ఒకరికొకరు హగ్ చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అభిమానులంతా నివ్వెరపోయేలా ఈ ఇద్దరు శత్రువులు మిత్రులయ్యారు.
భారత ఇన్నింగ్స్ 26వ ఓవర్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని కోహ్లీ బౌండరీ బాదాడు. రెండో బంతి వేసే ముందు కోహ్లీ దగ్గరకు వచ్చిన నవీన్ ఉల్ హక్.. అతనితో మాట్లాడుతూ హగ్ చేసుకున్నాడు. కోహ్లీ సైతం నవ్వుతూ అతన్ని దగ్గరికి తీసుకున్నాడు. ఈ చర్యతో ఈ ఇద్దరూ తమ మధ్య ఉన్న గొడవకు ముగింపు పలికినట్లు అయ్యింది.

ఈ ఇద్దరూ హగ్ చేసుకున్న ఫొటోలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది క్రికెట్‌గా నిలిచాయి. పిక్ ఆఫ్ ది డే.. బ్యూటీ ఆఫ్ క్రికెట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆటకు ఉన్న గొప్పతనమే ఇదని, శత్రువులను మిత్రులుగా మార్చే ఏకైక సాధనం ఆటనేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అంతకుముందు అఫ్గాన్ ఇన్నింగ్స్ సందర్భంగా బ్యాటింగ్‌కు వచ్చిన నవీన్ ఉల్ హక్‌కు కోహ్లీ ఫ్యాన్స్ చుక్కలు చూపించారు. క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇన్నింగ్స్ ముగిసి మైదానం వీడే వరకు కోహ్లీ నామస్మరణంతో స్డేడియం దద్దరిల్లేలా చేశారు.
అసలు గొడవ ఏంటంటే..?:ఐపీఎల్ 2023 సందర్భంగా విరాట్ కోహ్లీ-నవీన్ ఉల్ హక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. లక్నో వేదికగా ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రెండో మ్యాచ్‌లో జరిగిన ఈ గొడవ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ఘటనగా నిలిచిపోయింది. కోహ్లీ- నవీన్ ఉల్ హక్ గొడవ కాస్త మ్యాచ్ అనంతరం గంభీర్-కోహ్లీగా మారింది. ఒకరిపై ఒకరు దూసుకెళ్లేవరకు వెళ్లింది.
కోహ్లీ పదే పదే పిచ్‌పై పరుగెడుతున్నాడని నవీన్ ఉల్ హక్ అంపైర్లకు ఫిర్యాదు చేయడం గొడవకు కారణమైంది. తాను పిచ్‌పైకి వెళ్లలేదని, కావాలంటే తన షూస్‌ను చూడవచ్చని, ఎలాంటి మట్టి లేదని కోహ్లీ కాలిని పైకెత్తాడు. ఈ క్రమంలోనే నవీన్ ఉల్ హక్‌ను కోహ్లీ మందలించాడు. దాంతో అందరూ కోహ్లీని అపార్ధం చేసుకున్నారు.
నవీన్ ఉల్ హక్‌కు కోహ్లీ కాలు చూపించాడని భావించారు. గంభీర్ కూడా ఇలానే పొరపడి కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో కోహ్లీ ఏదో సూచనలు చేయబోగా.. నవీన్ ఉల్ హక్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. దాంతో గొడవ పెద్దది అయ్యింది.
అనంతరం ఈ గొడవ సోషల్ మీడియా వేదికగా కూడా కొనసాగింది. విరాట్ కోహ్లీ విడిచిపెట్టినా.. నవీన్ ఉల్ హక్ వదిలేయలేదు. మరో ఐపీఎల్ మ్యాచ్‌లో కోహ్లీ ఔటవ్వగా.. స్వీట్ మ్యాంగోస్ అంటూ ట్వీట్ చేశాడు. అది కోహ్లీ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అప్పటి నుంచి నవీన్ ఉల్ హక్‌కు ప్రతీ మ్యాచ్‌లో కోహ్లీ ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు.