Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదెక్కడి రనౌట్‌? మీ పాకిస్థానోళ్లకే సాధ్యం రా అయ్యా..!(వీడియో)

క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రనౌట్ చోటు చేసుకుంది. దురదృష్టవశాత్తు బ్యాటర్ క్రీజులో ఉండే రనౌటయ్యాడు. ఈ విచిత్రకరమైన రనౌట్ పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు షాక్ అవుతున్నారు. 'ఇదెక్కడి రనౌట్‌? మీ పాకిస్థానోళ్లకే సాధ్యం రా అయ్యా..!'అంటూ కామెంట్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?
పాకిస్థాన్ దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ టోర్నీ క్వైడ్ ఈ ఆజామ్ ట్రోఫీ( Quaid-e-Azam Trophy)లో భాగంగా పెషవార్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సియల్‌కోట్ బ్యాటర్ మొహమ్మద్ వాలీద్ దురదృష్టకర రీతిలో రనౌటయ్యాడు. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పెష్‌వార్ బౌలర్ మహమ్మద్ అమీర్ ఖాన్ వేసిన బంతిని మొహమ్మద్ వాలీద్ డిఫెండ్ చేశాడు.

Fans reactions after strange dismissal in Pakistan domestic league video

ఈ బంతిని అందుకున్న బౌలర్ అమీర్ ఖాన్.. వికెట్ల‌ వైపు బలంగా విసిరాడు. బంతి తాకుతుందో ఏమో అని బ్యాటర్ మొహమ్మద్ వాలీద్ తన కుడి కాలును పేకి లేపుతు జంప్ చేశాడు. దాంతో బంతి వికెట్లను తాకింది. వెంటనే పెష్‌వార్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. పలుకోణాల్లో రిప్లేలను పరిశీలించగా.. బంతి స్టంప్స్‌ను తాకే సమయంలో మొహమ్మద్ వాలీద్ గాల్లో ఉన్నాడు.

గాయాన్ని తప్పించుకునేందుకు అతను జంప్ చేయగా.. అది అతనికి చేటు చేసింది. అయితే ఈ డిసిమిస్సల్‌పై భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాటర్ క్రీజులో ఉండగానే బంతిని విసరాల్సిన అవసరం ఏం ఉంది? అని ఇది బౌలర్ తప్పిదమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి ఘటనలు జరగకపోవడంతో సరైన రూల్స్ లేవని కామెంట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ క్రికెట్‌లో అయితే బౌలర్ లెవల్-1 తప్పిదం చేశాడని చర్యలు తీసుకునేవారని ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు.

Story first published: Saturday, January 4, 2025, 15:10 [IST]
Other articles published on Jan 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+