Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: మహమ్మద్ షమీకి ఏమైంది? గాయమా? వ్యూహాత్మక నిర్ణయమా?

ఇంగ్లండ్‌తో తొలి టీ20లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ బరిలోకి దిగకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన షమీ.. తొలి మ్యాచ్ ఆడుతాడని అంతా అనుకున్నారు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం అతన్ని బెంచ్‌కే పరిమితం చేసింది.

తమ బలాలను నమ్ముకొని తుది జట్టును ఎంపిక చేశామని, ఈ క్రమంలోనే షమీ బెంచ్‌కు పరిమితం కావాల్సి వచ్చిందని టాస్ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అయితే మహమ్మద్ షమీ తొలి టీ20 ఆడకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తొలి టీ20లో మహమ్మద్ షమీని ఆడించకపోవడం వ్యూహాత్మక నిర్ణయమా? లేక గాయమా? అనే సందేహం అభిమానులకు కలుగుతోంది.

Fans Reactions After Mohammed Shami Not Playing In IND Vs ENG 1st T20I

మళ్లీ గాయం ఏమైనా తిరగబెట్టిందా? అనే ఆందోళన అభిమానులకు కలుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి కూడా ఎంపికైన షమీకి మ్యాచ్ ప్రాక్టీస్ కోసమే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. ఈ సిరీస్‌ షమీకి లిట్మస్ టెస్ట్‌లా నిలుస్తోందని అంతా అనుకున్నారు. కానీ గంభీర్ మాత్రం షమీని కాదని స్పెషలిస్ట్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకున్నాడు.

తుది జట్టులో బ్యాటింగ్‌ డెప్త్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో షమీకి చోటు దక్కలేదని విషయం అర్థమవుతోంది. స్పెషలిస్ట్ పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి దిగడంతో షమీ బెంచ్‌కు పరిమితం కావాల్సి వచ్చింది. వ్యూహాత్మక నిర్ణయమే కావచ్చిన కొందరు ఫ్యాన్స్ అంటుంటే.. మరికొందరు మాత్రం మళ్లీ గాయం తిరగబెట్టిందేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతోనే టీమిండియా షమీకి బదులు ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. ఏది ఏమైనా షమీ‌కి తుది జట్టులో అవకాశం దక్కకపోవడంపై అటు టీమిండియా మేనేజ్‌మెంట్, ఇటు బీసీసీఐ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తేమ ప్రభావం ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.

భారత్ తుది జట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ.

Story first published: Wednesday, January 22, 2025, 19:30 [IST]
Other articles published on Jan 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+