DC vs LSG: లాలిపాప్ క్యాచ్‌లు వదిలేసి కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్న లలిత్ యాదవ్!

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ లలిత్ యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లలిత్ యాదవ్ సూపర్ ఫీల్డింగ్ ఔరా అనిపించాడు. బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగురుతు అతను అందుకున్న క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. లలిత్.. తన మైమరిపించే ఫీల్డింగ్‌తో క్యాచ్ పట్టడమే కాకుండా సిక్సర్‌ను ఆపాడు. అంతేకాకుండా హాఫ్ సెంచరీతో విధ్వంసకరంగా ఆడిన కేఎల్ రాహుల్‌ను పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు ముందు లలిత్ యాదవ్ రెండు క్యాచ్‌లు నేలపాలు చేయడం గమనార్హం.
అసలేం జరిగిందంటే..?
ఇక తాను వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లోనే కేఎల్ రాహుల్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను లలిత్ యాదవ్ అందుకోలేకపోయాడు. కష్టతరమైన క్యాచే అయినప్పటికీ అందుకోదగినదే. ఆ క్యాచ్ పట్టుంటే రాహుల్ 15 పరుగులకే వెనుదిరిగే వాడు. ఇక ముస్తాఫిజుర్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ తొలి బంతికి మార్కస్ స్టోయినిస్ ఫ్లిక్ షాట్ ఆడగా.. బంతి గాల్లోకి లేచింది. డీప్ మిడ్ వికెట్ బౌండరీ లైన్‌కు ముందున్న లలిత్ యాదవ్.. లాలిపాప్ లాంటి క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఆ తర్వాత బంతిని ఆపడంలో కూడా లలిత్ తడబడి అనవసర పరుగులిచ్చుకున్నాడు. చెత్త ఫీల్డింగ్‌తో అభిమానుల ఆగ్రహానికి గురైన అతను.. రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌తో ఆ తప్పిదాలను మరిచిపోయేలా చేసాడు.
బౌండరీ లైన్ మీద..
శార్దూల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్‌లో మూడో బంతిని సిక్సర్ బాదిన రాహుల్.. ఆ మరుసటి బంతిని కూడా సిక్సర్‌గా మలిచే ప్రయత్నం చేశాడు. అయితే బౌండరీ లైన్ మీద జంప్ చేసిన లలిత్ బంతిని అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. దాంతో చెత్త ఫీల్డింగ్‌తో విలన్‌గా కనిపించిన లలిత్.. ఈ సూపర్ క్యాచ్‌తో అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ సూపర్ క్యాచ్ కారణంగా లక్నో 200లోపే పరిమితమయింది.
కావాలనే క్యాచ్ వదిలేసాడా?
అయితే మార్కస్ స్టోయినిస్ ఇచ్చిన లాలిపాప్ క్యాచ్‌ను లలిత్ యాదవ్ కావాలనే వదిలేసాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మార్కస్ స్టోయినీస్ క్రీజులో ఉంటే పరుగులు చేయలేడని, అందుకే అతను ఔటవ్వకుండా ఉండేందుకే లలిత్ ఇలా చేశాడని సెటైర్లు పేల్చుతున్నారు. మరికొందరు మాత్రం అసలు లలిత్ యాదవ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం కావడం లేదని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడితే దానికి లలిత్ యాదవే కారణమని మరికొందరు విమర్శిస్తున్నారు.
రాహుల్, దీపక్ హుడా హాఫ్ సెంచరీ..
ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(51 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 77), దీపక్ హుడా(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం అందించగా.. చివర్లో మార్కస్ స్టోయినిస్(17 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు విఫలమయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications