టెస్ట్ క్రికెట్‌లో ఆసక్తికర ఫలితాలు నమోదవుతున్నాయి. న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్ రెండు టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. దాంతో 'పొట్టోణ్ని పొడుగోడు కొడితే పొడుగోణ్ని పోచమ్మ కొట్టిందంట'అని సామెత గుర్తొస్తోంది. గత రెండు నెలల్లో ఓ జట్టుపై సిరీస్ గెలిచిన టీమ్.. మరో జట్టు చేతిలో వైట్ వాష్‌కు గురవుతోంది.
అక్టోబర్‌లో శ్రీలంక పర్యటనకు వెళ్లిన న్యూజిలాండ్ 0-2తో వైట్‌వాష్‌కు గురైంది. నవంబర్‌లో భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి సరికొత్త చరిత్రను లిఖించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియా తొలిసారి వైట్‌వాష్‌కు గురైంది.

భారత్‌పై క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్.. ఇప్పుడు ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్ అయ్యేందుకు రెడీ అయ్యింది. మరోవైపు న్యూజిలాండ్‌పై గెలిచి శ్రీలంక కూడా సౌతాఫ్రికా చేతిలో వైట్ వాష్ అయ్యేందుకు సిద్దమైంది.
ఆదివారం ముగిసిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ 323 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. 583 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 259 పరుగులకు కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 280 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 125 పరుగులకే కుప్పకూలింది.
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 427/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసి 583 పరుగుల భారీ లక్ష్యం నమోదు చేసింది. హ్యారీ బ్రూక్(123, 55) సంచలన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. జోరూట్(106) సైతం సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బ్యాటర్లలో టామ్ బ్లండెల్(115) శతకం సాధించినా ఫలితం లేకపోయింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్.. రెండో టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ఈ ఫలితాల నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ ఇంట్రెస్టింగ్‌గా మారిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.