చెప్పుతో కొట్టినట్లు ఆడావ్..
నిన్ను ఘోరంగా అవమానించి, జట్టు నుంచి వెల్లగొట్టిన జట్టుపై చెప్పుతో కొట్టినట్లు చెలరేగావ్ వార్నర్.. అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. గత సీజన్ వరకు సన్‌రైజర్స్‌కు ఆడిన వార్నర్‌ను మెగావేలానికి ముందు ఆ జట్టు వదిలేసింది. గత సీజన్ సెకండాఫ్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా జట్టుకు దూరం చేసింది. వార్నర్‌ను కనీసం డగౌట్‌కు కూడా రానివ్వలేదు. దాంతో అతను ప్రేక్షకుడిలా మైదానంలో మ్యాచ్‌లను తిలకించాడు. మనీశ్ పాండే విషయంలో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌తో తలెత్తిన వివాదం అతన్ని జట్టు నుంచి బయటకు పంపేలా చేసింది.
వార్నర్ భాయ్ నువ్వు సూపరో సూపర్..
ఇక వ్యక్తిగత ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వకుండా జట్టు కోసం ఆడిన వార్నర్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 92 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సెంచరీ చేసుకునే ఆస్కారం ఉన్నా.. అతను జట్టు మేలు గురించే ఆలోచించాడు. చివరి ఓవర్‌లో స్ట్రైకింగ్ తీసుకోకుండా ధాటిగా ఆడాలని పొవెల్‌కు సూచించాడు. దాంతో వార్నర్‌ను అభిమానులు కొనియాడుతున్నారు. నిస్వార్థపరుడంటూ ప్రశంసిస్తున్నారు.
ముఖం చాటేసిన కావ్య పాప..
డేవిడ్ వార్నర్ విధ్వసంకర ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ముఖం చాటేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కావ్య పాపతో పాటు టామ్ మూడీ కూడా తలెత్తుకోలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. బంగారం లాంటి ఆటగాడిని సన్‌రైజర్స్ వదులుకొని మూల్యం చెల్లించుకుందని కామెంట్ చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సైతం వార్నర్ సూపర్ ఇన్నింగ్స్‌ను ఆస్వాదిస్తున్నారు.
విఫలమైన బౌలర్లు..
డేవిడ్ వార్నర్, రోవ్‌మన్ పొవెల్ పరుగుల విధ్వంసంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు చేసింది. ఈ ఇద్దరి విధ్వంసం ముందు హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. పోటాపడి మరీ పరుగులిచ్చుకున్నారు. భువీ, సీన్ అబాట్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ ఆదిలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ(7), కేన్ విలియమ్సన్(4) వికెట్లు కోల్పోయింది.


Click it and Unblock the Notifications
