పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 10 వేల పరుగుల మైలు రాయి అందుకున్న ఆటగాడిగా బాబర్ ఆజామ్ చరిత్రకెక్కాడు. 271 ఇన్నింగ్స్‌ల్లోనే అతను ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్‌ల రికార్డును బ్రేక్ చేశాడు.
285 ఇన్నింగ్స్‌ల్లో గేల్ ఈ ఫీట్ సాధించగా.. కోహ్లీ(299), డేవిడ్ వార్నర్(303) ఇన్నింగ్స్‌ల్లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) 2024 సీజన్‌లో పెషావర్ జాల్మీ జట్టుకు సారథ్యం వహిస్తున్న బాబర్ ఆజామ్.. కరాచీ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజామ్(51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 72) హాఫ్ సెంచరీతో రాణించాడు. తద్వారా టీ20ల్లో 10 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో తన షెషావర్ టీమ్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. దాంతో అతని వరల్డ్ రికార్డుకు విలువ లేకుండా పోయింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పేషావర్ 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజామ్‌తో పాటు రోవ్‌మెన్ పోవెల్(39) రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కరాచీ కింగ్స్.. కీరన్ పోలార్డ్(21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 16.5 ఓవర్లలోనే 3 వికెట్లకు 157 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. పొలార్డ్ సునామీ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజామ్ వరల్డ్ రికార్డు కొట్టుకుపోయింది. ఈ క్రమంలోనే బాబర్ ఆజమ్‌పై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా జోకులు పేల్చుతున్నారు. 'వరల్డ్ రికార్డు వృథా అయ్యేరా.. ఆజామూ'అని కామెంట్ చేస్తున్నారు.