Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Arjun Tendulkar: సచిన్ కొడుకు స్టన్నింగ్ యార్కర్.. కుప్పకూలిన బ్యాటర్ (వీడియో)

ముంబై ఇండియన్స్ పేస్ ఆల్‌రౌండర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్.. స్టన్నింగ్స్ యార్కర్‌తో ఔరా అనిపించాడు. అతని కళ్లు చెదిరే యార్కర్‌‌ను ఆడలేకపోయిన బ్యాటర్.. క్రీజులోనే కుప్పకూలాడు. ఒకే ఓవర్‌లో రెండు, మూడు కళ్లు చెదిరే యార్కర్లతో బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టాడు.

ప్రస్తుతం అతని స్టన్నింగ్స్ యార్కర్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఐపీఎల్ 2024 సీజన్ కోసం సమాయత్తం అవుతున్న అర్జున్ టెండూల్కర్.. ముంబై ఇండియన్స్ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్‌లో చెమట చిందిస్తున్నాడు. గంటల కొద్దీ బౌలింగ్ చేస్తూ.. తమ జట్టు బ్యాటర్లకు సవాల్ విసురుతున్నాడు.

Fans Reactions after Arjun Tendulkar s lethal yorker throws batsman off his feet ahead of IPL 2024

మంగళవారం జరిగిన నెట్‌సెషన్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను అర్జున్ టెండూల్కర్ ఇబ్బంది పెట్టాడు. అతని కాళ్లను టార్గెట్ చేస్తూ వేసిన యార్కర్‌కు సమాధానం ఇవ్వలేకపోయిన ఇషాన్ కిషన్.. క్రీజులో కుప్పకూలాడు. ఆ తర్వాత మరో రెండు బంతులను కూడా ఇలానే వేసి ఇబ్బంది పెట్టాడు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

అర్జున్ టెండూల్కర్.. తన మార్క్ ప్రదర్శన చేస్తున్నాడని క్యాప్షన్‌గా పేర్కొంది. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అర్జున్ టెండూల్కర్‌ను కొనియాడుతుంటే.. మరికొందరు మాత్రం నెపోటిజం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ యార్కర్‌ను చూసి అతని బావ శుభ్‌మన్ గిల్ ఎక్కువ సంతోషిస్తాడని ఒకరు సెటైర్ పేల్చితే.. అసలు మ్యాచ్‌లో అర్జున్ ఇలా బౌలింగ్ చేయడని మరొకరు కామెంట్ చేశారు.

ఇక అర్జున్ టెండూల్కర్‌కు అండగా ఇషాన్ కిషన్ భలే యాక్టింగ్ చేస్తున్నాడని మరొకరు విమర్శించారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో తొలిసారి ముంబై ఇండియన్స్‌కు ఎంపికైన అర్జున్ టెండూల్కర్.. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. సచిన్‌పై ఉన్న గౌరవంతో ముంబై ఇండియన్స్ ప్రతీ సీజన్‌లో అర్జున్ టెండూల్కర్‌ను రిటైన్ చేసుకుంటుంది. 2021లోనే జట్టులో చేరినా.. అతని అరంగేట్రం 2023లో జరిగింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ లెఫ్టార్మ్ పేసర్ అరంగేట్రం చేశాడు.

తొలి మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 17 పరుగులిచ్చాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతను 9.36 ఎకానమీతో మూడు వికెట్లు తీసాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలోనూ అర్జున్ టెండూల్కర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అతను 11 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు మాత్రమే తీసాడు.

బ్యాటింగ్‌లో మాత్రం రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 23.45 సగటుతో 258 రన్స్ చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్ ముంబై ఇండియన్స్ మార్చి 24న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.

Story first published: Tuesday, March 12, 2024, 15:09 [IST]
Other articles published on Mar 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+