ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మరోసారి దూకుడుగా ఆడాడు. బాజ్‌బాల్ గేమ్‌తో భారత బౌలర్లను చెడుగుడు ఆడాడు. ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో తనకే సాధ్యమైన స్విచ్ హిట్, రివర్స్ స్వీప్, స్వీప్ షాట్స్‌తో బౌండరీలు బాదాడు. అతనికి తోడుగా మరో ఓపెనర్ జాక్ క్రాలీ కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఈ జోడీ టీ20 తరహా బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ 14.4 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ అందుకుంది. అయితే దూకుడుగా ఆడుతున్న బెన్ డకెట్(38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48)ను ఆకాష్ దీప్ పెవిలియన్ చేర్చాడు. దాంతో డకెట్ హాఫ్ సెంచరీని చేజార్చుకోగా.. తొలి వికెట్‌కు నమోదైన 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఈ మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బెన్ డకెట్‌కు బంతి తాకరని చోట తాకింది. దాంతో అతను నొప్పితో విలవిలలాడాడు. కాసేపు ఆగి ఫిజియోల సాయంతో తిరిగి బ్యాటింగ్ చేశాడు. ఆకాష్ దీప్ వేసిన నాలుగో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని ఆకాష్ దీప్ సరైన లెంగ్త్‌లో వేసాడు. ఆ బంతిని అంచనా వేయడంలో డకెట్ విఫలమయ్యాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి నేరుగా డకెట్ జననాంగానికి బలంగా తాకింది. దాంతో క్రీజులోనే కుప్పకూలిన డకెట్ నొప్పితో అల్లాడిపోయాడు.

ఫిజియోలు వచ్చి అతనికి ఉపశమనం కలిగించే చికిత్స చేశారు. దాంతో ఆట కాసేపు ఆగింది. ఆ తర్వాత తిరిగి బ్యాటింగ్ కొనసాగించిన డకెట్.. ఎలాంటి ఇబ్బంది లేకుండా దూకుడుగా ఆడాడు. అయితే బెన్ డకెట్ ప్రైవేట్ పార్ట్‌లో బంతి తాకడంతో నెటిజన్లు అతన్ని హెచ్చరిస్తున్నారు. 'బెన్ డకెట్.. నీ సామన్లు జాగ్రత్త'అని కామెంట్ చేస్తున్నారు.
తన బౌలింగ్‌లో ఔటై వెళ్తున్న బెన్ డకెట్‌తో ఆకాష్ దీప్ మాట్లాడాడు. అతని భుజాలపై చేతులు వేసి మరి నవ్వుతూ ఏదో చెప్పాడు. అతని స్విచ్ హిట్ గురించే ఆకాష్ దీప్ కామెంట్ చేసినట్లు అనిపించింది. రివర్స్ స్కూప్ ఆడబోయే ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో బెన్ డకెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి కెప్టెన్ ఓలి పోప్ రాగా.. జాక్ క్రాలీ 42 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ 109/1 స్కోర్ లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
అంతకుముందు 204/6 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా 69.4 ఓవర్లలో 224 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు కరుణ్ నాయర్(109 బంతుల్లో 8 ఫోర్లతో 57), వాషింగ్టన్ సుందర్(55 బంతుల్లో 3 ఫోర్లతో 26) నిరాశపర్చారు. మహమ్మద్ సిరాజ్(0), ప్రసిధ్ కృష్ణ(0) డకౌటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్(5/33) ఐదు వికెట్లు తీయగా.. జోష్ టంగ్(3/57) మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్‌కు ఓ వికెట్ దక్కింది.