Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025 ఫైనల్లో ఆర్‌సీబీ X ముంబై ఇండియన్స్!

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) దుమ్మురేపుతోంది. ప్రత్యర్థి వేదికలపై ఆ జట్టు వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 10 మ్యాచ్‌లు ఆడి 7 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. మరో విజయం సాధిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కానుండగా.. మరో రెండు గెలిస్తే టాప్-2 ప్లేస్ ఫిక్స్ అవ్వనుంది. ఆర్‌సీబీకి ప్లే ఆఫ్స్ చేరేందుకు 90 శాతం అవకాశాలున్నాయి. ఆర్‌సీబీ తమ తదుపరి మ్యాచ్‌ల్లో సీఎస్‌కే(మే 3), లక్నో సూపర్ జెయింట్స్(మే 9), సన్‌రైజర్స్ హైదరాబాద్‌(మే 13), కేకేఆర్(మే17)లతో తలపడనుంది.

మరోవైపు ముంబై ఇండియన్స్ సైతం సైలెంట్‌గా ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఈ సీజన్ ఆరంభంలో 5 మ్యాచ్‌లు 4 ఓడిన ముంబై ఇండియన్స్.. జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీతో విజయాల బాట పట్టింది. వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి దూసుకొచ్చింది.

చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మరో రెండు విజయాలు సాధిస్తే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ కారారు కానుండగా.. మూడు గెలిస్తే టాప్-2లో నిలవనుంది. ముంబై ఇండియన్స్‌కు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు 64 శాతంగా ఉన్నాయి. ముంబై తదుపరి మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్(మే1), గుజరాల్ టైటాన్స్(మే 6), పంజాబ్ కింగ్స్(మే 11), ఢిల్లీ క్యాపిటల్స్(మే 15)లతో ఆడనుంది.

Fans Predicts RCB and MI will face in IPL 2025

ఫైనల్లో ఆర్‌సీబీ X ముంబై..
ఓవైపు ఆర్‌సీబీ.. మరోవైపు ముంబై ఇండియన్స్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తుండటంతో ఈ రెండు జట్లు ఫైనల్ చేరుతాయని ఫ్యాన్స్ జోస్యం చెబుతున్నారు. ఈ రెండు జట్లు ఫైనల్ చేరితే ఈ సీజన్‌ చరిత్రలో నిలిచిపోతుందని, ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ మ్యాచ్‌గా చరిత్రకెక్కుతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ రెండు జట్లు ఫైనల్ చేరి ఆర్‌సీబీ విజయం సాధించాలని ఆ జట్టు ఫ్యాన్స్ కోరుకుంటే.. ఫైనల్ చేరితో ఓడిన చరిత్ర ముంబైకి లేదని ఆ టీమ్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు టీమ్స్ ఫైనల్ చేరితే సినిమాకు మించిన డ్రామా ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.

ప్లే ఆఫ్స్ చేరే జట్లు..
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కే ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెరుగైన ప్రదర్శన చేస్తే పంజాబ్ కింగ్స్‌ కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోవచ్చు. లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతాలు జరిగితే తప్పా ప్లే ఆఫ్స్ చేరలేవు. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి.

Story first published: Monday, April 28, 2025, 16:16 [IST]
Other articles published on Apr 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+