For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

162 బంతులు.. ఒకే ఒక్క ఫోర్.. నీ జిడ్డు బ్యాటింగ్‌కు దండం సామీ!

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్‌లో శతకం సాధించిన టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి శతక సాధించడం అమోఘం.. అద్భుతం అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. కానీ నితీష్ కుమార్ రెడ్డికి సహకరించిన స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌‌ను ఎవరూ పెద్దగా గుర్తించడం లేదు.

నితీష్ రెడ్డి సెంచరీ చేశాడంటే దానికి ప్రధాన కారణం వాషింగ్టన్ సుందర్. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగోడికి అండగా అతను సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఓవైపు నితీష్ రెడ్డి ట్రేడ్ మార్క్ షాట్స్ పరుగులు రాబడుతుంటే.. మరోవైపు సూపర్ డిఫెన్స్‌తో సుందర్ ఆకట్టుకున్నాడు.

Fans Praises Washington Sundar Afer He Scores 1 Four In 162 balls In IND vs AUS 4th Test

తనకే సాధ్యమైన డిఫెన్స్‌తో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్ మిచెల్ మార్ష్‌ల లయను దెబ్బతీసాడు. ఏడు వికెట్లు తీసి జోరు మీదున్న ఆసీస్ బౌలర్లకు తన జిడ్డు బ్యాటింగ్‌తో చుక్కలు చూపించాడు. ఎలాంటి దూకుడు ప్రదర్శించకుండా సహనంతో బ్యాటింగ్ చేశాడు. నిర్లక్ష్యపు షాట్లు ఆడకుండా క్విక్ సింగిల్స్, డబుల్స్, ట్రిపుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ నితీష్ కుమార్ రెడ్డికి సహకరించాడు.

146 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న వాషింగ్టన్ సుందర్‌.. ఇందులో ఒకే ఒక్క బౌండరీ బాదాడు. ఆ తర్వాత మరో 16 బంతులాడిన సుందర్ ఒక్క పరుగు కూడా చేయలేదు. నితీష్ రెడ్డి కోసం పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. నాథన్ లయన్ బౌలింగ్‌లో అనూహ్యంగా వచ్చిన బంతి అతని గ్లోవ్ తాకి స్లిప్ క్యాచ్‌గా వెళ్లింది. దురదృష్టవశాత్తే సుందర్ ఔటయ్యాడే తప్పా.. ఎలాంటి తప్పిదం చేయలేదు. 8వ వికెట్‌కు 127 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించాడు.

గత ఆసీస్ పర్యటనలోనూ సుందర్ ఈ తరహా ప్రదర్శన చేశాడు. గతంలో టెయిలెండర్‌గా అతను శతకం చేసుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆ బాధ అతనికి తెలుసు కాబట్టే.. నితీష్‌కు అండగా నిలిచాడు. అంతేకాకుండా టీమిండియా కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉండటంతో క్రీజులో నిలబడటమే ముఖ్యమని భావించి డిఫెన్స్ ఆడాడు. ఈ క్రమంలోనే క్రికెట్ విశ్లేషకులు వాషింగ్టన్ సుందర్‌ను ప్రశంసిస్తున్నారు. కొందరు నెటిజన్లు కూడా 'సుందర్.. నీ ఓపికకు దండం సామీ'అని కొనియాడుతున్నారు.

Story first published: Saturday, December 28, 2024, 16:37 [IST]
Other articles published on Dec 28, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+