Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసూయ ఆంటీతో తిలక్ వర్మ.. వైరల్‌గా మారిన వీడియో!

అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం రావడంతో టీమిండియా స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ సరదాగా గడుపుతున్నాడు. ఈ ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆస్వాదిస్తున్నాడు. భారత్‌కు ఇప్పట్లో టీ20 మ్యాచ్‌లు లేకపోవడంతో తిలక్ వర్మ ఇంటికే పరిమితమయ్యాడు.

IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తిలక్ వర్మ!

IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తిలక్ వర్మ!

ఈ ఖాళీ సమయంలో తిలక్ వర్మ.. తన కళా పోషణను బయటపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రిల్స్ చేస్తూ తన యాక్టింగ్ స్కిల్స్‌ను బయటపెట్టుకుంటున్నాడు. ప్రముఖ ఇన్‌స్టా ఇన్ఫ్లూయెన్సర్ రీనుతో ఓ రీల్‌లో నటించాడు. ఇందులో చాలా సహజంగా నటించి నెటిజన్ల మనసును గెలుచుకున్నాడు.

Fans Praise Tilak Varma Acting Skills in Fun Reel With Social Media Influencer Reenu
Photo Credit: Instagram

తన కొడుకు కంటే ఎక్కువ సంపాదించే చుట్టాల అబ్బాయిని చూసి అసూయపడే ఆంటీ అనే కాన్సెప్ట్‌తో ఈ రీల్‌ను రూపొందించారు. ఇందులో రీను అసూయపడే ఆంటీలా నటిస్తే.. తిలక్ వర్మ బాగా సంపాదించే కుర్రాడిలా నటించాడు. డైలాగ్స్ లేకపోయినా కేవలం హావభావాలతో ఇద్దరూ అదరగొట్టారు. తిలక్ వర్మ అయితే జీవించాడు. మనిషన్నాకా కాస్తంత కళా పోషణ ఉండాలి అనే రీతిలో యాక్టింగ్ అదరగొట్టాడు.

ఈ వీడియోను షేర్ చేసిన రీనూ.. దమ్ముంటే ఈ రీల్‌ను మీ అసూయపడే ఆంటీకి పంపించండి అని క్యాప్షన్‌గా పేర్కొంది. ఈ రీల్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. భారీ సంఖ్యలో వ్యూస్, లైక్స్‌తో దూసుకెళ్తోంది. రిటైర్మెంట్ తర్వాత యాక్టర్‌గా తిలక్ వర్మ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టేలా ఉన్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సినీ రంగంలో తిలక్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెబుతున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న తిలక్ వర్మ.. దులీప్ ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు.

IND vs SL: ధ్రువ్ జురెల్‌కు బదులు అతన్ని ఆడించండి: మహమ్మద్ కైఫ్

Also Read

IND vs SL: ధ్రువ్ జురెల్‌కు బదులు అతన్ని ఆడించండి: మహమ్మద్ కైఫ్

ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనున్న ఈ టోర్నీలో సౌత్ జోన్‌కు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత్ తరఫున ఒకే ఫార్మాట్ ఆడుతున్న తిలక్ వర్మ.. మూడు ఫార్మాట్లు ప్లేయర్‌గా మారేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. భవిష్యత్తులో టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలను కూడా అందుకునే అవకాశం ఉంది.

Story first published: Wednesday, August 12, 2026, 15:29 [IST]
Other articles published on Aug 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+