Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Gujarat Titans లోగో ఆవిష్కరణ.. 130 MB డాటా బొక్క అంటూ ఫ్యాన్స్ ఫైర్!

Fans not happy with Gujarat Titans’ new logo

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. ఆలస్యంగా తమ టీమ్ లోగోను విడుదల చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు శుభమర్ గిల్, హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ఆదివారం మెటావర్స్‌లో లోగోను ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియోను గుజరాత్ టైటాన్స్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అగ్రస్థానంలో నిలవడమే తమ టీమ్ డీఎన్‌ఏ అని టీమ్ మోటోను తెలియజేసింది.

అయితే టీమ్ లోగోపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తొక్కలో లోగో కోసం తమ 130 ఏంబీ డాటా వృథా అయిందని మండిపడుతున్నారు. టీమ్ లోగో ఏ మాత్రం బాలేదని కామెంట్ చేస్తున్నారు. లోగో తయారు చేయడానికి ఏ మాత్రం శ్రద్ద కనబర్చలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ సంస్థ సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్ జ‌ట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా, ఆశిష్ నెహ్రా హెడ్ కోచ్‌గా, గ్యారీ కిర్‌స్ట‌న్ మెంటార్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న విషయం తెలిసిందే. వేలానికి ముందు హార్ధిక్‌తో పాటు రషీద్‌ ఖాన్‌(15 కోట్లు), శుభ్‌మన్‌ గిల్‌(8 కోట్లు)లను డ్రాఫ్టెడ్‌ ప్లేయర్లుగా ఎంచుకున్న గుజరాత్‌ టైటాన్స్‌.. వేలంలో మ‌రో 52 కోట్లు ఖర్చు చేసి 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఫెర్గూసన్‌ (10 కోట్లు), జేసన్‌ రాయ్‌ (2 కోట్లు), డేవిడ్‌ మిల్లర్‌ (3 కోట్లు), మాథ్యూ వేడ్‌ (2.4 కోట్లు), రాహుల్‌ తెవాతియా (9 కోట్లు) లాంటి విధ్వంసకర ఆటగాళ్లను గుజరాత్‌ టైటాన్స్‌ రికార్డు ధరకు సొంతం చేసుకుంది.

డ్రాఫ్ట్ ప్లేయర్లు..
హార్ధిక్‌ పాండ్యా(15 కోట్లు), రషీద్‌ ఖాన్‌(15 కోట్లు), శుభ్‌మన్‌ గిల్‌(8 కోట్లు)

IPL 2022 Mega Auction : Ahmedabad Franchise Announced Official Team Name | Oneindia Telugu

మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
లోకి ఫెర్గూసన్‌ (10 కోట్లు), రాహుల్‌ తెవాతియా (రూ. 9 కోట్లు), మహ్మద్‌ షమీ (6.25 కోట్లు), యశ్‌ దయాల్‌ (3.2 కోట్లు), ఆర్‌ సాయ్‌ కిషోర్‌ (3 కోట్లు)
డేవిడ్‌ మిల్లర్‌ (3 కోట్లు) , అభినవ్‌ సదరంగని (2.6 కోట్లు), మాథ్యూ వేడ్‌ (2.4 కోట్లు), అల్జరీ జోసఫ్‌ (2.4 కోట్లు), జేసన్‌ రాయ్‌ (2 కోట్లు), వృద్ధిమాన్‌ సాహా (1.9 కోట్లు), జయంత్‌ యాదవ్‌ (1.70 కోట్లు), విజయ్‌ శంకర్‌ (1.40 కోట్లు), డామినిక్‌ డ్రేక్స్‌ (1.10 కోట్లు), గురుకీరత్‌ సింగ్‌ (50 లక్షలు), వరుణ్‌ ఆరోన్‌ (50 లక్షలు), నూర్‌ అహ్మద్‌ (30 లక్షలు), దర్శన్‌ నల్ఖండే (20 లక్షలు), ప్రదీప్‌ సాంగ్వాన్‌ (20 లక్షలు), సాయి సుదర్శన్‌ (20 లక్షలు)

Story first published: Sunday, February 20, 2022, 22:47 [IST]
Other articles published on Feb 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+