Virat Kohli: కెప్టెన్సీ పోయినా క్రేజ్ తగ్గలే.. ఆస్ట్రేలియా, కేరళలో భారీ కటౌట్లు!

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుందే తప్పా ఇసుమంత కూడా తగ్గడం లేదు. కెప్టెన్సీ పోయినా.. కొన్నాళ్లు సరిగ్గా ఆడకపోయినా.. అతన్ని క్రేజ్ మాత్రం రెండింతలు అయ్యింది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అత్యంత ఆదరణ కలిగిన ఏకైక క్రికెటర్‌గా కింగ్ కోహ్లీ నిలిచాడు. ఇన్‌స్టా, ట్విటర్ వేదికగా అత్యధిక ఫాలోవర్లు కలిగి ఉన్న క్రికెటర్ కూడా కోహ్లీనే. సోషల్ మీడియా వేదికగా అతను షేర్ చేసే ఓ వ్యాపారపరమైన పోస్ట్‌కు కోట్ల రూపాయలు వస్తాయంటే అతని క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
కేరళలో భారీ కటౌట్..
ఆసియాకప్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకం బాది.. మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. కీలక టీ20 ప్రపంచకప్ ముందు కింగ్ కోహ్లీ ఒకప్పటిలా ఆడుతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. భారత్, సౌతాఫ్రికా మధ్య జరగబోయే మొదటి టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న తిరువనంతపురంలో అభిమానులు భారీ విరాట్ కోహ్లీ కటౌట్ ఏర్పాటు చేశారు. గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం బయట ఏర్పాటు చేసిన ఈ కటౌట్, విరాట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

బుధవారం నుంచి షురూ..
భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20లు జరుగుతాయి. తొలి మ్యాచ్ సెప్టెంబర్ 28 (బుధవారం) తిరువనంతపురం వేదికగా జరుగుతుంది. అలాగే రెండో టీ20 మ్యాచ్ గౌహతి వేదికగా అక్టోబర్ 2 (ఆదివారం), చివరి టీ20 ఇండోర్ వేదికగా అక్టోబర్ 4 (మంగళవారం)న జరగనుంది. ప్రతి మ్యాచ్ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.

జట్ల వివరాలు..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్,అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, బుమ్రా, దీపక్ చాహర్, హర్షల్ పటేల్
సౌతాఫ్రికా: టెంబా బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రీక్స్, హెన్రీచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జ్, వ్యాన్ పర్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడా, రిలీ రసౌ, తబ్రైజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్, బ్జోర్న్ ఫర్చిన్, మార్కో జాన్సెన్, అండిలే పెహ్లుక్వాయో
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications