Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టైలిష్ లుక్‌లో ధోనీ భాయ్.. అచ్చం బాలీవుడ్ హీరోలానే..!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ( MS Dhoni new hairstyle) న్యూలుక్ అభిమానులను వీపరితంగా ఆకట్టుకుంటోంది. కుర్ర హీరోను తలపిస్తున్న ధోనీ ఆహార్యానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా మోకాలి గాయంతో ఇబ్బంది పడిన ధోనీ.. టోర్నీ ముగిసిన వెంటనే ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.

అనంతరం కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న మహీ.. కుటుంబంతో కలిసి విదేశాల్లో పర్యటించాడు. యూఎస్ ఓపెన్ 2023 టోర్నీ మ్యాచ్‌లకు హాజరయ్యాడు. ఈ సమయంలో గుబురు గడ్డంతో కనిపించిన ధోనీ.. ఆ తర్వాత పిలకతో దర్శనమిచ్చాడు. తాజాగా లూజ్ హెయిర్‌తో బ్లాక్ స్పెడ్స్ పెట్టుకుని అచ్చం కుర్ర హీరోలా ఫోజుచ్చి అందర్నీ షాక్‌కు గురి చేశాడు. ఈ ఫొటోలో ధోనీ లవర్ బాయ్‌లా ఉన్నాడు.

Fans love MS Dhoni new hairstyle and his vintage look

ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సడెన్‌గా చూస్తే టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబులా ఉన్నావని కొందరు అంటే.. హాలీవుడ్ హీరోలా ఉన్నావని మరికొందరు అభిప్రాయపడ్డారు. 43 ఏళ్ల వయసులో కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నావ్.. ఏం తింటున్నావ్ సామీ.. అంటూ ప్రశ్నించారు.

అమ్మాయిలు అయితే ధోనీ న్యూలుక్‌కు పడి చచ్చిపోతున్నారు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో సారథిగా చెన్నైని మరోసారి ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరిగినా.. మరో సీజన్ ఆడుతానని ధోనీ స్పష్టం చేశాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో మరోసారి ధోనీ (MS Dhoni) అభిమానులను అలరించే అవకాశం ఉంది. ధోనీ సారథ్యంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అప్పటి నుంచి మళ్లీ భారత్ ఒక్క ఐసీసీ టైటిల్ కూడా అందుకోలేకపోయింది. అక్టోబర్ 5 నుంచి 2023 వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై మెగా టోర్నీ జరుగుతుండటంతో టీమిండియా విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ధోనీ వారసుడిగా రోహిత్ విశ్వకప్ అందుకుంటాడని అభిప్రాయపడుతున్నారు.

Story first published: Tuesday, October 3, 2023, 18:16 [IST]
Other articles published on Oct 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+