Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Zaheer Khan vs Ishant Sharma: ఇదేందయ్యా ఇన్నాళ్లు ఇది చూడలే!

న్యూఢిల్లీ: టీమిండియా దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్, వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ టెస్ట్ కెరీర్ గణంకాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇదర్ది వికెట్ల లెక్కలు సమంగా ఉండటం అందర్నీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. భారత్-వెస్టిండీస్ సిరీస్‌కు జియో‌సినిమా కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న ఈ దిగ్గజ పేసర్లు.. తమ వికెట్ల లెక్కలను చూసుకొని సంతోషం వ్యక్తం చేశారు.

కాకతాళీయమో ఏమో కానీ ఇద్దరి టెస్ట్ కెరీర్ గణంకాలు సమంగా ఉన్నాయి. జహీర్ ఖాన్ తన కెరీర్‌లో 311 టెస్ట్ వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ కూడా సరిగ్గా 311 వికెట్లే తీసాడు. జహీర్ ఖాన్ తన కెరీర్‌లో 11 సార్లు ఐదు వికెట్ల ఘనతను, ఒకసారి 10 వికెట్ల ఘనతను అందుకోగా.. ఇషాంత్ శర్మ కూడా 11 సార్లు 5 వికెట్ల ఘనత.. ఒక్కసారి 10 వికెట్ల ఘనతను అందుకున్నాడు.

Zaheer Khan vs Ishant Sharma

అంతేకాకుండా స్వదేశంలో జహీర్ ఖాన్ 104.. విదేశాల్లో 207 వికెట్లు తీస్తే.. ఇషాంత్ శర్మ కూడా భారత్‌లో 104, ఓవర్‌సీస్‌లో 207 వికెట్లు తీసాడు. ఈ గణంకాలన్నీటిని భారత్-వెస్టిండీస్ రెండో టెస్ట్ సందర్భంగా జియో‌సినిమా ప్రేక్షకుల ముందు ఉంచగా.. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

అభిమానులు ఈ లెక్కలను చూసి అవాక్కవుతున్నారు. 'ఇదేందయ్యా ఇన్నాళ్లు ఇది చూడలే'అంటూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. సౌరవ్ గంగూలీ‌తో పాటు ధోనీ సారథ్యంలో ప్రధాన పేసర్‌గా కొనసాగిన జహీర్ ఖాన్.. టీమిండియా 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీ అనంతరం జట్టుకు దూరమైన జహీర్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ముంబై ఇండియన్స్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నాడు.

కామెంటేటర్‌‌గా, అనలిస్ట్‌గా కూడా పని చేస్తున్నాడు. మరోవైపు ఇషాంత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకకున్నా.. కామెంటేటర్‌గా అవతారమెత్తాడు. జియో సినిమా హిందీ కామెంటేటర్‌గా సేవలందిస్తున్నాడు. ఇషాంత్ కామెంట్రీ చెప్పడం ఇదే తొలిసారి. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇషాంత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు.

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. 365 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన వెస్టిండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 76 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్(28), కిర్క్ మెక్‌కెంజీ(0) విఫలమవ్వగా.. తేజ్‌నారయణ్ చంద్రపాల్(24 బ్యాటింగ్), జెర్మైన్ బ్లాక్‌వుడ్(20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీసాడు.

Story first published: Monday, July 24, 2023, 19:42 [IST]
Other articles published on Jul 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+